ఎవరి సర్టిఫికెట్ నాకు అవసరం లేదు: కిషన్ రెడ్డి

దుబ్బాక ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా ప్రచారంలో దూస్కెళ్తోంది బీజేపీ. ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలను చేశానని… ఆ ఉద్యమాల్లో టీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొన్నారని చెప్పారు కిషన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తానేంటో ప్రజలకు తెలుసని.. తనకు ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దుబ్బాక ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. ఉపఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని… ఆ పార్టీలకు ఓటు వేయడం వల్ల ఉపయోగం లేదని అన్నారు. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని గెలిచేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోందని ఆరోపించారు కిషన్ రెడ్డి.

Latest Updates