ఎలక్షన్ల గురించి నేనట్లా అనలే..

జీహెచ్ఎంసీ ఎలక్షన్లు ఈసీ పరిధిలోని అంశం: కేటీఆర్

పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే అన్నట్టు వివరణ

హైదరాబాద్, వెలుగు: నవంబర్​లో గ్రేటర్​ హైదరాబాద్​ ఎలక్షన్లు ఉంటాయని తాను అనలేదని.. పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే సూచించానని మంత్రి కేటీఆర్​ అన్నారు. ఎలక్షన్లు పూర్తిగా ఈసీ పరిధిలోని అంశమని పేర్కొన్నారు. పార్టీ నేతలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో నవంబర్​ 11 తర్వాత ఎప్పుడైనా జీహెచ్ఎంసీ ఎలక్షన్లు రావొచ్చని మంత్రి కేటీఆర్​ చెప్పారు. దీనిపై మీడియాలో వార్తలు రావడంతో.. ఎప్పుడు ఎలక్షన్లు జరుగుతాయన్నది కేటీఆర్​ ఎట్లా నిర్ణయిస్తారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కేటీఆర్​ బుధవారం ట్విట్టర్​లో వివరణ ఇచ్చారు. ‘‘నవంబర్ లో గ్రేటర్ ఎన్నికలు ఉంటాయని నేను అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. జీహెచ్ఎంసీ యాక్టు ప్రకారం నవంబర్ రెండో వారం తర్వాత ఎలక్షన్లు ఎప్పుడైనా రావొచ్చని, కనుక పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే నేను అనడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్, నిర్వహణ పూర్తిగా ఎలక్షన్​ కమిషన్​ పరిధిలోని అంశం. నేను అనని మాటలు నాకు ఆపాదించారు’’ అని ట్వీట్లు చేశారు.

For More News..

కేసీఆర్ తమ దగ్గర పుట్టనందుకు ఇతర రాష్ట్రాల వాళ్లు బాధపడుతున్నరు

ఫీజులు కట్టకున్నా ఆన్ లైన్ క్లాసులకు అనుమతించండి

కట్​ చేసిన జీతాలు 4 వాయిదాల్లో చెల్లింపు

Latest Updates