సీఎంగా పనిచేయాలనుకోవట్లేదు : మమతా

కలకత్తా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అపజయాలకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నానని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలనుకోవడం లేదని .. పార్టీ ఒత్తిడి మేరకే కొనసాగుతున్నానని ఆమె అన్నారు. ఎన్నికలలో కేంద్ర బలగాలు తమకు వ్యతిరేకంగా పనిచేశాయని, రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులను సృష్టించారని అన్నారు. హిందూ-ముస్లింల పేరుతో అరాచకాలను సృష్టించారని.. ఈ విషయమై ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మమతా అన్నారు.

Latest Updates