వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం సమయంలో ఆ ఆలోచన తట్టింది

‘‘నా కెరీర్‌‌‌‌లో తొలి సందేశాత్మక చిత్రమిది. వాస్తవిక పాత్రల ఆధారంగా కాల్పనిక కథాంశంతో తీసిన పొలిటికల్ సెటైర్ మూవీ. ఇలాంటి జానర్ సినిమా ఇండియాలో ఇంత వరకూ రాలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం సమయంలో నాకీ ఆలోచన తట్టింది. ఒక వర్గం వారు మరొక వర్గం వారి ప్రదేశానికి రావడం అనేది నన్ను ఇన్‌‌స్పైర్ చేసింది. అందుకే ఈ టైటిల్ నిర్ణయించాను. ఒకరిని తక్కువ చేసి, మరొకరిని ఎక్కువ చేసి చూపించలేదు. మే 2019 నుండి సెప్టెంబర్ 2020 మధ్య జరిగినవి, జరుగుతున్న వాటితో పాటు జరగబోయేవి ఊహించి తీశాం. మాజీ ముఖ్యమంత్రిని పోలిన ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వ్యక్తిని ట్రాక్ చేసి తనకో నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆ పాత్ర చేయించాం. ఆయన్ని ఆటోడ్రైవర్‌‌‌‌గా చూపించడం జస్ట్ ఫ్యాంటసీ ఎలిమెంట్.  రాష్ట్రాన్ని ఆయన ఎంత బాగా నడిపిస్తున్నారనడానికి అలా చూపించాను. ఇక తెలుగుదేశం పార్టీ వాళ్లకే ‘పప్పు’ సీన్ ఎక్కువగా నచ్చిందని విన్నాను. పవన్ కళ్యాణ్‌‌ని పోలిన పాత్ర మాత్రమే సినిమాలో ఉంది. మా సినిమాలోని మనసేనకి పవన్ కళ్యాణ్‌‌కి ఎలాంటి సంబంధం లేదు. ప్రత్యేకంగా ఎవరినీ టార్గెట్ చేయలేదు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నవే చూపించాం. నా గత చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని బాలకృష్ణకి అంకితమిచ్చాను. అలాగే ఈ సినిమాని ఓ ఇద్దరు తండ్రికొడులకు అంకితమిస్తున్నాను. ఇక ఇలాంటి సినిమాలు నాకు వృత్తిపరంగా కంటే వ్యక్తిగతంగానే ఎక్కువ తృప్తినిస్తాయి. ఎందుకంటే చిన్నప్పటి నుండి నాకు గిల్లడం ఇష్టం. ఓ ఫిల్మ్ మేకర్‌‌‌‌గా నేను సొంతంగా ఫీలయిన ఎగ్జైట్‌‌మెంట్‌‌నే సినిమాగా చెప్పాలనుకుంటాను. నేను తీసే రియలిస్టిక్ డ్రామాలకు ఇమేజ్ ఉన్న హీరోలు సరిపడరు. అందుకే కొత్తవాళ్లతో చేస్తున్నాను. నా సినిమాలపై కోర్టుకు వెళ్లడమనేది సూర్యుడు తూర్పున ఉదయించడం అంత రెగ్యులర్. కనుక అలాంటివి పెద్దగా పట్టించుకోను. కె.ఎ.పాల్ లాంటి వ్యక్తులను కూడా పట్టించుకోవడం మానేశాను.  ‘బ్యూటిఫుల్’ సినిమా వచ్చే నెలలో విడుదల చేయనున్నాం. ఇండో–చైనీస్ కో– ప్రొడక్షన్‌‌గా తీసిన ‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’ విడుదల సన్నాహాల్లో ఉంది.’’

Latest Updates