మెగాస్టార్ సినిమా నుంచి తప్పుకున్న త్రిష

హైదరాబాద్‌:  త్రిష అభిమానులందరికీ ఇది నిజంగా షాకింగ్ న్యూస్. మెగాస్టార్ మూవీతో మరోసారి చిరు సరసన త్రిష నటించబోతుందని అటు సినీ వర్గం, ఇటు మీడియా వర్గం అన్ని తెలిపాయి. అయితే తాను సినిమాలో నటించట్లేదంటూ తన ట్వీట్ ద్వారా తేల్చి చెప్పేసింది త్రిష.

కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై  కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిరంజీవి కొత్త సినిమాకు హీరోయిన్ గా త్రిషను ఎంచుకున్నారు. అయితే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు శుక్రవారం సాయంత్రం కన్ఫామ్ చేసేసింది.

“కొన్ని విషయాలు మొదట్లో చెప్పిన, చర్చించిన వాటికి భిన్నంగా ఉంటాయి. క్రియేటివ్ అంశాల్లో మార్పుల వల్ల నేను చిరంజీవి సర్ సినిమాలో భాగం కాకూడదని నిర్ణయించుకున్నాను. సినిమా బృందానికి నా అభినందనలు. త్వరలో మరో మంచి ప్రాజెక్టుతో తెలుగు ప్రేక్షకులను తప్పకుండా కలుస్తానని ఆశిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.

త్రిష ఇంతకుముందు మెగాస్టార్ తో కలిసి స్టాలిన్ సినిమాలో నటించింది. చాన్నాళ్ల తర్వాత మళ్లీ చిరంజీవితో కలిసి నటిస్తుందని తెలిసి అభిమానులంతా చాలా సంతోషపడ్డారు. కానీ ఆమె ఈ సినిమా నుండి తప్పుకుందని తెలిసి సోషల్ మీడియాలో నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.

Latest Updates