నాకున్నది సింగిల్ ఓటర్ ఐడీనే: గంభీర్

తనకు రెండు చోట్ల ఓటర్ ఐడీ ఉందన్న ఆరోపణలపై ఢిల్లీ ఈస్ట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ క్లారిటీ ఇచ్చారు. తనకు రెండు ఓటర్ ఐడీలు లేవని, ఢిల్లీలోని రాజేంద్ర నగర్ నుంచి మాత్రమే తనకు సింగిల్ ఓటర్ ఐడీ ఉందని చెప్పారు.  సరైన దిశానిర్దేశం లేకనే ఆమ్ ఆద్మీ పార్టీ ‘ప్రతికూల రాజకీయాల’కు పాల్పడుతోందని  విమర్శించారు. ఆ పార్టీకి సరైన విజన్ లేదని, గత నాలుగైదేళ్లుగా ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. రెండు ఓటర్ ఐడీలున్న గౌతమ్ గంభీర్‌పై అనర్హత వేటు వేయాలంటూ ఢిల్లీ ఈస్ట్ ఆప్ అభ్యర్థి అతిషి వేసిన పిటిషన్‌  మే 1న  విచారణ జరుగనుంది..

 

Latest Updates