త్వరలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశిస్తున్నాం

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీఎం పీఠం కోసం బీజేపీ,శివసేన పట్టబడుతుండటంతో స్పష్టత రావడం లేదు.  మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అస్థిరంగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అకాల వర్షాలకు పంటనష్టపోయిన కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.  ఈ సందర్భంగా అకోలాలో పర్యటించిన దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలో ప్రతిష్టంభన ముగుస్తుందన్నారు . ప్రతి ఒక్కరూ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాల్సిందేనన్నారు. త్వరలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. మరి కొన్ని రోజుల్లనే ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్తత వస్తుందన్నారు ఉద్ధవ్ థాక్రే. మొత్తం 288 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 105,శివసేన 56 సీట్లు గెలుచుకున్నాయి. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకోగా మిగతావి ఇతరులు గెలుచుకున్నారు.

Latest Updates