జడ్జిమెంట్ ఎర్రర్ నిజమే : ఓవర్ త్రో పై అంపైర్ స్పందన

వరల్డ్ కప్ ఫైనల్‌ లో ఓవర్ త్రోకు 6 రన్స్ ఇచ్చి వివాదాస్పద నిర్ణయం తీసుకున్న అంపైర్ కుమార ధర్మసేన వారం తర్వాత స్పందించాడు. ఆదివారం శ్రీలంకలో ఓ ఛానల్ లో మట్లాడిన ధర్మసేన.. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ దాని గురించి ఆలోచించడం, తలచుకుని బాధపడడం లాంటివి చేయబోనన్నాడు. అయితే, తప్పు మాత్రం జరిగిందని అంగీకరించాడు. టీవీ రీప్లేలు చూసి ఎన్నైనా చెప్పొచ్చు. టీవీ రీప్లే చూసినప్పుడే నాకూ తెలిసింది. జడ్జిమెంట్ ఎర్రర్ జరిగిన మాట వాస్తవం. అయితే, గ్రౌండ్‌లో మాకు పెద్దపెద్ద టీవీలు ఉండవు కదా. అయినా, ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ దాని గురించి ఆలోచించి చింతించే అలవాటు నాకు లేదు. ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయానికి ఐసీసీ కూడా ప్రశంసించింది. అని ధర్మసేన వివరించాడు.

ఓవర్ త్రోపై నిర్ణయం తీసుకునే ముందు లెగ్ అంపైర్ ఎరాస్‌మస్‌ను సంప్రదించానని ధర్మసేన తెలిపాడు. ఇతర అంపైర్లు కూడా ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు ఇవ్వడాన్ని అంగీకరించారని తెలిపాడు. ఇలాంటి సమయంలో దానిని థర్డ్ అంపైర్‌కు ఇవ్వాలని క్రికెట్ చట్టంలో లేదన్నాడు. అందుకనే కమ్యూనికేషన్ సిస్టం ద్వారా థర్డ్ అంపైర్‌ కు సమాచారం అందించానని, దానిని ఇతర అంపైర్లు, మ్యాచ్ రిఫరీ కూడా విన్నాడని ధర్మసేన చెప్పాడు. అయితే చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఏంలాభం అంటూ ధర్మసేనకు చురకలు అంటిస్తున్నారు నెటిజన్లు.

Latest Updates