ఐ సపోర్ట్‌‌‌‌‌‌‌‌ సీఏఏ అంటూ పెళ్లికార్డుపై ప్రింట్

సిటిజన్‌‌‌‌షిప్‌‌‌‌ సవరణ గురించి జనానికి చెప్పేందుకే

మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన పెళ్లి కొడుకు వినూత్న ప్రయత్నం

నర్సింగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: సిటిజన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ అమెండ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌ (సీఏఏ)కు సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఒక పెళ్లికొడుకు తన పెళ్లికార్డుపై ప్రో–సీఏఏ స్లోగన్‌‌‌‌‌‌‌‌ను ప్రింట్‌‌‌‌‌‌‌‌ చేయించారు. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు చూసి కలత చెందానని, దానికి మద్దతుగా ప్రచారం చేయాలనే ఈ ప్రయత్నం చేశానని నర్సింగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని కరేలీకి చెందిన ప్రభాత్‌‌‌‌‌‌‌‌ గర్హవాల్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. పెళ్లికి వచ్చే గెస్ట్‌‌‌‌‌‌‌‌లకు కూడా దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తానని అన్నారు. “ ప్రజలు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని నేను నమ్ముతాను అందుకే ‘ఐ సపోర్ట్‌‌‌‌‌‌‌‌ సీఏఏ’ స్లోగన్‌‌‌‌‌‌‌‌ను కార్డుపై వేయించాలని అనుకున్నాను. దీని వల్ల సరైన అవగాహన కలుగుతుందని అనుకుంటున్నాను” అని గర్హల్‌‌‌‌‌‌‌‌ అన్నారు. సిటిజన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ అమెండ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి యాంటీ సీఏఏ, ప్రో–సీఏఏ ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలోని చాలా మంది ఈ చట్టాన్ని వ్యతిరేకించగా.. కొంత మంది
సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు.

దునియా ఆస్తి రూ.256.18 కోట్ల కోట్లు

కారులో 400 రోజులు.. లక్ష కిలోమీటర్లు..

గర్ల్‌ఫ్రెండ్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి..

Latest Updates