ధోని తన ప్రభను కోల్పోయాడు: రోజర్ బిన్నీ

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని తన ప్రభను కోల్పోయాడని మాజీ క్రికెటర్, సెలెక్టర్ రోజర్ బిన్నీ చెప్పాడు. ఇందుకు గత రెండు సీజన్స్‌లో ధోని పెర్ఫామెన్స్‌లు తార్కాణం అన్నాడు. గతేడాది ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్ తర్వాత నుంచి ధోని ఫీల్డ్‌లోకి దిగలేదు. వచ్చే నెలలో మొదలుకానున్న ఐపీఎల్‌లో తడాఖా చూయించడానికి మాహీ సిద్ధమవుతున్నాడు. ఆ టోర్నీలో అతడు రాణిస్తే టీమిండియాకు తిరిగి ఆడే అవకాశాలు ఉంటాయని సీనియర్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రోజర్ బిన్నీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

‘ధోని కొంచెం ఫిట్‌నెస్ కోల్పోయాడు. వ్యవస్థ నుంచి కొత్త ప్లేయర్లు దూసుకొస్తున్నారు. నూతన ఆటగాళ్లకు తన గ్లోవ్స్‌ను అందించడానికి మాహీకి టైమ్ ఆసన్నమైంది. అతడు తన బెస్ట్‌ను దాటేశాడు. గత కొన్ని సీజన్ల నుంచి అతడి ఆటను గమనిస్తే.. ధోని తన బెస్ట్‌ పెర్ఫామెన్స్‌లను దాటేసినట్లు అనిపిస్తోంది’ అని బిన్నీ చెప్పాడు.

Latest Updates