మద్దతు ధర విషయంలో ప్రతీ రైతుకు భరోసా ఇస్తా

కనీస మద్దతు ధర విషయంలో ప్రతీ రైతుకు తాను భరోసా ఇస్తానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కనీస మద్దతు ధరల విధానం మునుపటిలాగే కొనసాగుతుందన్నారు. వ్యవసాయ బిల్లుల ఆమోదంపై మాట్లాడిన మోడీ వ్యవసాయంలో మార్పులు ప్రస్తుతానికి అవసరమని.. రైతుల కోసం ఈ సంస్కరణను తీసుకొచ్చిందన్నారు. ప్రతీ రైతును తాను అభినందిస్తున్నానన్నారు.

కొత్త బిల్లులతో రైతులు తమ పంటలను ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకోవచ్చన్నారు. ఈ బిల్లులు వ్యవసాయ మండీలకు వ్యతిరేకం కాదన్నారు.  కరోనా వైరస్ మహమ్మారి సమయంలో, రబీ సీజన్లో రైతుల నుండి గోధుమలను రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారన్నారు. కనీస మద్దతు ధర కింద రైతులకు  లక్ష 13 వేల కోట్లు ఇచ్చామన్నారు.. ఈ మొత్తం గత సంవత్సరంతో పోలిస్తే 30% కంటే ఎక్కువన్నారు.

 

బస్ భవన్ ముట్టడి.. ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు అరెస్ట్

రాజ్యసభలో గందరగోళం.. 8 మంది ఎంపీలు సస్పెండ్

రాష్ట్రంలో మరో 1302 కేసులు..9 మంది మృతి

 

Latest Updates