పెయింటర్‌ కావాలనుంది: ధోని

బాల్యంలో తనకు గొప్ప పెయింటర్‌‌ కావాలని ఉండేదని ఇండియా మాజీ కెప్టెన్‌‌ ఎంఎస్‌‌ ధోనీ చెప్పాడు. క్రికెట్‌‌కు రిటైర్మెంట్‌‌ ప్రకటించాకా ఈ కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తానన్నాడు. ‘ఓ రహస్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. చిన్నతనం నుంచి నాకు పెయింటర్‌‌ కావాలని కోరిక ఉండేది. అది నెరవేరకుండానే క్రికెట్‌‌లోకి వచ్చేశా. ఇప్పుడు చాలా క్రికెట్‌‌ ఆడేశా. వీడ్కోలు తర్వాత  నా కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తా. మిగిలిపోయిన పెయింటింగ్‌‌లను పూర్తి చేస్తా’ అని ధోనీ ఓ వీడియోను పోస్ట్‌‌ చేశాడు. ల్యాండ్‌‌స్కేపింగ్‌‌పై తొలి పెయింటింగ్‌‌ వేసిన ధోనీ.. భవిష్యత్‌‌ రవాణ వ్యవస్థపై మరో చిత్రాన్ని గీశాడు. ఇక ముచ్చటగా మూడోది సీఎస్‌‌కే జెర్సీలో తన బ్యాటింగ్‌‌ స్టిల్‌‌ను చిత్రించాడు. ఈ చిత్రం తనకు అత్యంత ఇష్టమైనదని అని చెప్పాడు. తన పెయింటింగ్‌‌లకు సంబంధించి త్వరలోనే ఓ ఎగ్జిబిషన్‌‌ను ఏర్పాటు చేస్తానన్నాడు.

Latest Updates