నేను 10వ త‌ర‌గ‌తి పాస‌య్యానోచ్..క‌ష్ట‌ప‌డి ఇంట‌ర్ చదువుతా : ఎడ్యుకేష‌న్ మినిస్ట‌ర్

జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి 10వ త‌ర‌గ‌తి పాస్ అయ్యారు. 25ఏళ్ల త‌రువాత 10వ త‌ర‌గ‌తి పాసైన‌ 53 ఏళ్ల మంత్రి బోకారో జిల్లాలోని దేవి మహోతో ఇంటర్ కాలేజీలో చేరారు.

జార్ఖండ్ మంత్రివ‌ర్గంలో జగ‌ర్నాథ్ మహ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. జ‌గ‌ర్నాథ్ ప‌దోత‌ర‌గ‌తి కూడాపాస్ కాలేదు. దీంతో ఆయ‌న గురించి హేళ‌న మాట్లాడుతుండేవారు. ఆ విష‌యం ఆయ‌న‌కి కూడా తెలుసు. దీంతో ఎలాగైన ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసి పాస్ అవ్వాల‌ని అనుకున్నారు.

అయితే క‌రోనా కార‌ణంగా జార్ఖండ్ ప్ర‌భుత్వం ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండానే అంద‌ర్ని పాస్ చేయించింది. ఆ ప‌రీక్ష‌లు రాయ‌కుండానే జ‌గ‌ర్నాథ్ పాస్ అయ్యారు. ఇటీవ‌ల విడుద‌లైన ప‌రీక్ష‌ల్లో ప‌దో త‌ర‌గ‌తి పాసైన‌ట్లు చెప్పారు.

నాకు చాలా ఆనందంగా ఉంది నేను ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయ్యాను . చాలా మంది నా శ‌క్తి సామ‌ర్ధ్యాల్ని ప‌ట్టించుకోకుండా నా విద్యా అర్హ‌త గురించి హేళ‌న చేస్తున్నారు. ఇప్పుడు నేను టెన్త్ పాస్ అయ్యాను ఇంట‌ర్మీడియ‌ట్ క‌ష్ట‌పడి చ‌దువుతానంటూ వెల్ల‌డించారు.

జార్ఖండ్ మంత్రుల విద్యా అర్హ‌త ఇలా ఉంది…?

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) ప్రకారం జెఎంఎం , కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో 11 మందిలో సీఎంహేమంత్ సోరెన్‌తో సహా, ఎనిమిది మంది మంత్రులు తమ విద్యా అర్హత 8వ త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు మంత్రులు మాత్రమే గ్రాడ్యుయేట్ మరియు అంతకంటే ఎక్కువ అర్హత ఉన్నట్లు స‌మాచారం.

81 మందిలో 49 మంది గ్రాడ్యుయేట్ మరియు అంతకంటే ఎక్కువ విద్యా అర్హత ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. సుమారు 30 మంది తమ విద్యా అర్హతను 8 వ పాస్ మరియు 12 వ పాస్ మధ్య ఉన్నట్లు ప్రకటించారు. ఒకరు కేవలం అక్షరాస్యులుగా ప్రకటించారు. మరో ఎమ్మెల్యే డిప్లొమా హోల్డర్.

2016 లో జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే ప్రకారం, రాష్ట్రంలో మొత్తం అక్షరాస్యత 70.3 శాతం ఉండగా, ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక స్థాయిలలో బాలికల నమోదు 50 శాతం వద్ద నిలిచిపోయింది.

Latest Updates