నేనూ భాగ్యలక్ష్మి టెంపుల్ కు వస్తా… చర్చకు మోడీ రావాలి

బండి సంజయ్ కు మంత్రి తలసాని సవాల్

హైదరాబాద్:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బండి సంజయ్ కు రాష్ట్ర పశుసంవర్ధక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. కేసీఆర్ ని సవాల్ చేసే స్థాయి  బండి సంజయ్ కి ఉందా..? అని తలసాని ప్రశ్నించారు. హైదరాబాద్ బేగంబజార్ డివిజన్ లోని టీఆరెస్ అభ్యర్థి పూజ వ్యాస్ సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ కి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. బీజేపీ కి ఓటు వేస్తే హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నట్లే అన్నారు.

వరద సహాయం 25 వేల రూపాయలు చేస్తారంటున్న బీజేపీ.. ప్రధాని మోడీ కి మంత్రి సవాల్ చేశారు. బుధవారం తాను కూడా భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తానని.. మోడీ కూడా అక్కడికి రావాలని వ్యంగంగా సవాల్ విసిరారు. వరద సహాయానికి కేంద్రం నిధులిచ్చిన జీవో, 25 వేల సహాయం అధిస్తామంటున్న జీవో లను తీసుకొని రావాలన్నారు. బీజేపీ విద్వేషాలు రెచ్చగొట్టకుండా.. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఏమి చేస్తారో చెప్పాలని మంత్రి తలసాని సూచించారు.

FOR MORE NEWS…

టీఆర్ఎస్ ఫేక్ న్యూస్ ప్రచారానికి దిగడం.. ఓటమిని ఒప్పుకున్నట్లే

V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు 

ఇకపై ఆయుర్వేద డాక్టర్లూ ఆపరేషన్లు చేయొచ్చు

జీరో బడ్జెట్ రాజకీయాలు చేసే దమ్ముందా..?

వీడియో: మహిళలను వేధిస్తున్న ఆకతాయిలతో రోడ్డు మీదే..

జీహెచ్ఎంసీ ఎన్నికలు: చిన్న వయసులోనే నామినేషన్

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేటీఆర్‌ని కలిసిన యాంకర్ సుమ

చేతిలో రూపాయి లేకుండా కార్పొరేటర్ బరిలోకి

ప్రచారానికి పోతే రూ.1000, బిర్యానీ ప్యాకెట్

Latest Updates