ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా: శరద్ పవార్

వారసత్వ రాజకీయాలకు తెరలేపుతున్నారంటూ వస్తున్న విమర్శలకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. గత కొద్ది నెలలుగా శరద్ పవార్ కుటుంబ సభ్యులు ప్రత్యక్షరాజకీయ ప్రవేశం, ఎన్నికలలో పోటీపై వస్తున్న ఊహాగానాలకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు. 2019 ఎన్నికలలో తన కుటుంబం నుంచి తాను మాత్రమే ఎన్నికలలో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అంతేకాదు  తన సమీప బంధువు అజిత్ పవార్ కూడా ఎన్నికలలో పోటీ చేయబోరని తెలిపారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులెవరూ ఎన్నికలలో పోటీలో నిలబడరని తేల్చేశారు శరద్ పవార్.

 

Latest Updates