బోధన్‌‌‌‌లో రోహింగ్యాలు ఉన్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా

  • బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్

బోధన్ (నిజామాబాద్), వెలుగు: బోధన్ లో రోహింగ్యాలు లేరని, ఉన్నట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ సవాలు విసిరారు. బంగ్లాదేశీయులు అక్రమంగా మన దేశంలోకి చొరబడి నకిలీ పాస్ పోర్టులు తీసుకుంటుంటే.. కేంద్రం , సెక్యూరిటీ బలగాలు, నిఘావర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. మంగళవారం బోధన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. పాస్ పోర్టుల ఇష్యూ స్టేట్​పరిధిలోది కాదన్నారు. ఎవరైనా పాస్ పోర్టుకు అప్లయ్ చేస్తే .. గ్రౌండ్ లో వెరిఫై చేసి రిపోర్టును పాస్ పోర్టు ఆఫీసుకు పంపించడమే పోలీసుల బాధ్యత అని చెప్పారు. ఒకే ఇంటి అడ్రస్ పై 32 పాస్ పోర్టులు తీసుకుంటుంటే.. పాస్​పోర్టు ఆఫీసర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బార్డర్ లో సరైన సెక్యూరిటీ లేకపోవడంతో బంగ్లాదేశీయులు మన దేశంలోకి ఎంటర్‌‌ అవుతున్నారని అన్నారు. ముందుగా ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్​లోకి చొరబడి అక్కడ  ఆధార్​కార్డులు తీసుకుని.. తెలంగాణలోకి వస్తున్నారని అన్నారు. బోధన్​లో అడ్రస్, ఇంటి నంబర్​మార్చేసి.. నకిలీ పాస్ పోర్టులు పొందినట్టు తెలిపారు. ఎంపీ అర్వింద్ సీఎం కేసీఆర్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు.

ఇవి కూడా చదవండి 

ఫారిన్ లిక్కర్ అగ్గువకే

మంత్రి గంగుల పిటిషన్.. సర్కారుకు నోటీసులు

కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ ఫామ్​హౌస్​కు..

కేసీఆర్.. ఫైళ్లు ముడ్తలే.. రివ్యూలు చేస్తలే

Latest Updates