భరత మాత కోసం రెండో బిడ్డనీ పంపుతా

పట్నా: భరత మాత రక్షణ కోసం తన రెండో బిడ్డను కూడా పంపుతానని పుల్వామా దాడిలో అమరుడైన ఓ సైనికుడి తండ్రి గంభీర స్వరంతో చెప్పారు. పుల్వామాలో నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. వారిలో బిహార్ లోని భగల్పూర్ కు చెందిన రతన్ ఠాకూర్ ఒకరు. ఆయన మృతి వార్త విని.. ఓ వైపు తమ బిడ్డను కోల్పోయామన్న బాధలో ఉన్న ఆ కుటుంబం.. మరో వైపు భరత మాత సేవలో ప్రాణ త్యాగం చేశాడని గర్విస్తోంది. దేశం కోసం తాను ఒక కొడుకుని కోల్పోయానని, ముష్కరులతో పోరాడేందుకు రెండో కొడుకుని కూడా పంపుతానని ఠాకూర్ తండ్రి అన్నారు. దేశం కోసం రెండో బిడ్డను కూడా త్యాగం చేసేందుకు సిద్ధమని చెప్పారు. అయితే పాకిస్థాన్ కు మాత్రం గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు.

Latest Updates