వెల్మల్​ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

  •                గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎంపీ అర్వింద్​

సంసద్‌‌ ఆదర్శ్‌ ‌గ్రామీణ యోజన(సాగి) ద్వారా వెల్మల్‌‌ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని నిజామామాద్‌‌ ఎంపీ ధర్మపురి అర్వింద్​అన్నారు. సాగి కార్యక్రమంలో భాగంగా ఆదివారం వెల్మల్‌‌ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. స్థానిక పంచాయతీ ఆఫీస్​లో గ్రామానికి చెందిన ముఖ్యుల సమక్షంలో అన్ని శాఖలకు చెందిన అధికారులతో రివ్యూ నిర్వహించారు. గ్రామంలో ఏ పనులు చేపట్టవచ్చు, వాటికి నిధులు ఏ విధంగా తీసుకురావాలనే విషయాలను ఆయా శాఖలకు చెందిన ఆఫీసర్లతో చర్చించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, పార్టీలు పక్కన పెట్టి అభివృద్ధిలో అందరూ సహకరించాలని కోరారు.

Latest Updates