మూడు రాష్ట్రాలకు బన్నీ రూ.1.25 కోట్ల విరాళం

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో పేద,మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సెలబ్రిటీలు,రాజకీయ ప్రముఖులు ప్రభుత్వాలకు తమ వంతు సాయం చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి ప్రభాస్ రూ.4 కోట్లు, పవన్ రూ.2 కోట్లు, చిరంజీవి రూ. కోటి,మహేశ్ బాబు రూ.కోటి, రామ్ చరణ్ రూ.70 లక్షలు సాయం చేశారు.వీరితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్,కోరటాల శివ,దిల్ రాజు పలువురు డొనేట్ చేశారు. లేటెస్ట్ గా అల్లు అర్జున్ కూడా తన వంతు ఆర్థిక సాయం చేశారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు రూ. 1.25 కోట్లు విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఏపీలకు చెరో రూ.50లక్షలు, కేరళకు రూ.25 లక్షలు ప్రకటించారు. ఈ విషయాన్ని  తన ఇన్ స్ట్రాగ్రమ్ లో పోస్ట్ చేశాడు బన్నీ. కరోనా మహమ్మారిని ఎదుర్కొంటామనే ఆశాభావం వ్యక్తం చేశాడు. బన్నీకి కేరళలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని పిలుస్తారు.

Latest Updates