విడాకులకు దరఖాస్తు చేసిన IAS దంపతులు 

IAS దంపతులు టీనా డాబీ, అథర్ అమీర్ ఖాన్ లు విడాకులు తీసుకునేందుకు కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. 2015 సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో టీనా డాబీ టాపర్, అదే ఏడాది అథర్ అమీర్ ఖాన్ ఆలిండియా సెకండ్ ర్యాంక్ సాధించారు. అథర్ అమీర్ ఖాన్ జమ్మూకశ్మీర్ కు చెందిన వారు. వీరిద్దరూ రాజస్థాన్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారులు. IAS ట్రైనింగ్ సమయంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి.. అది ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరూ 2018లో మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. జైపూర్ లోని ఫ్యామిలీ కోర్టు-1లో డైవోర్స్ కోసం దరఖాస్తు చేశారు. ఇద్దరం కలిసి జీవించలేమని… తమకు విడాకులు మంజూరు చేయాలని పిటిషన్ లో కోరారు.

టీనా డాబీ సోషల్ మీడియాలోని తన ఖాతాలో తన పేరు వెనుక పెట్టుకున్న ఖాన్ ను తొలగించారు. అథర్ ఖాన్ కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి టీనాను అన్ ఫాలో చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీగా టీనా పని చేస్తుండగా.. అథర్ అమీర్ ఈజీఎస్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు.

Latest Updates