టైం లేక ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారు

అసలే కంప్యూటర్ యుగం..ఉరుకుల పరుగుల జీవితం. ఒక్కోసారి తినడానికి కూడా టైం దొరకని పరిస్థితి. ఇక ఐఏఎస్ ,ఐపీఎస్ ల సంగతి చెప్పాల్సిన పని లేదు. తీరిక లేకుండా బిజీ షెడ్యూల్. అందుకే ఆమె ఐపీఎస్ , అతను ఐఏఎస్ ఇంకేముంది టైం లేక బిజీ షెడ్యూల్ వల్ల ఆఫీస్ లోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ ఘటన కోల్ కతాలో జరిగింది.

పంజాబ్ కు చెందిన  వరుడు తుషార్ సింగ్లా ఐఏఎస్ కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఉలుబేరియాలో ఎస్‌డిఓగా పనిచేస్తున్నాడు. ఇక వధువు నవజోత్ సిమి 2017 బ్యాచ్ బీహార్ కేడర్ ఐపిఎస్ అధికారి. నవజోత్ సిమి తుషార్ సింగ్లా కొన్ని రోజుల క్రితం నుంచి ప్రేమించుకుంటున్నారు. 2021లో పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వల్ల తుషార్ సింగ్లా బిజీ అయ్యాడు. దీంతో  చాలా సార్లు పెళ్లి వాయిదా పడింది. ఇక ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. పాట్నాలో ఉన్న నవజోత్ సిమి నిన్న లవర్స్ డే రోజున  కోల్ కతాలోని తుషార్ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడ రిజిస్ట్రార్ ను పిలిచి సంతకాలు చేశారు. ఇద్దరు పెళ్లి బట్టలు ధరించారు. కుటుంబ సభ్యులు, ఆఫీస్ సిబ్బంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆఫీస్ బయట ఫోటోలకు పోజులిచ్చారు. అయితే పని ఎక్కువగా ఉండటం వల్ల ఇలా ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నామని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేసి అందరికీ విందు ఇస్తామని చెప్పారు.

Latest Updates