శబరిమల ఆలయానికి IAS అధికారి: సుప్రీంకోర్టు

శబరిమల ఆలయానికి టీటీడీ తరహాలో ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. శబరిమల ఆలయంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. టీటీడీ తరహాలో శబరిమల ఆలయ బోర్డు ప్రత్యేక చట్టం చేయాలని కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండునెలల్లో కొత్త చట్టాన్ని కోర్టుకు సమర్పించాలని కోర్టు తెలిపింది. చట్టం చేయాలని గతంలోనే చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. లక్షలాది మంది భక్తులు వెళ్లే అయ్యప్ప ఆలయానికి ప్రత్యేక చట్టం ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. కేరళలో 3వేల దేవాలయాలకు ఒకే ఐఏఎస్ అధికారి ఉండటం సరికాదన్నారు. అయ్యప్ప దేవాలయాన్ని ప్రత్యేకంగా తీసుకోవాలని తెలిపింది సుప్రీం కోర్టు.

 

Latest Updates