ఈఎంఐ మారిటోరియం : 3నుంచి 6నెలలకు పెంచాలి

కరోనా వైరస్ ప్రభావంతో నష్టపోతున్న ప్రజలకు, వ్యాపారులకు కాస్త ఊరటనిచ్చేందుకు ఆర్‌బీఐ రుణాల ఈఎంఐల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మారటోరియంను ఆరు నెలల పాటు పెంచాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ చర్యలు తీసుకుంటున్నాయి. కానీ వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు.

ఈ నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తాజాగా కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) పలు కీలక సూచనలు చేసింది. కరోనా వైరస్ వల్ల ప్రతికూల ప్రభావం ఎదుర్కొంటున్న రంగాలపై ఆర్థిక భారం తగ్గించాలని సూచించింది. వన్ టైమ్ లోన్ రిస్ట్రక్చరింగ్, ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి ఉపశమనం కల్పించడం, మారటోరియం పెంపు (3 నుంచి 6 నెలలకు) వంటి సదుపాయాలను కల్పించాలని ప్రతిపాదించింది.

ఈ సందర్భంగా ఐబీఏ  చైర్మన్ రజనీష్ కుమార్ మాట్లాడుతూ.. లోన్ మారటోరియం పీరియడ్‌ను 3 నెలల నుంచి 5-6 నెలలకు పెంచాలని ఐబీఏ బ్యాంకులను కోరిందని గతంలోనే తెలియజేసినట్లు చెప్పారు.

లాక్ డౌన్ లో క్రెడిట్ ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి కొన్ని ప్రమాదకర రంగాలకు ఇచ్చే రుణాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ హామీలు  ఉన్నాయని ఐబిఎ ఛైర్మన్  కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Latest Updates