ఐబీపీఎస్ లో 12 వేల క్లర్క్​ పోస్టులకు​ నోటిఫికేషన్​ విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 12074 క్లర్క్‌‌ పోస్టుల భర్తీకి ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్)  నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి అక్టోబర్​ 9 వరకు ఆన్​లైన్‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్​లో ప్రిలిమినరీ ఎగ్జామ్​ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయితే మెయిన్స్ రాయాలి.   ఇంటర్వ్యూ లేదు.

మొత్తం ఖాళీలు 120,74 కాగా మనరాష్ట్రంలో 612, ఆంధ్రప్రదేశ్‌‌లో 777 పోస్టులున్నాయి. ఆయా రాష్ట్రాల స్థానిక భాషపై అవగాహన, పట్టు ఉన్న అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి దేశంలో ఎక్కడైనా నియమించే అధికారం బ్యాంకులకు ఉంటుంది.

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్స్​ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించిన భాష మాట్లాడటంతో పాటు చదవడం, రాయడం రావాలి.

వయసు: 2019 సెప్టెంబర్​ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5; ఓబీసీలకు 3, పీహెచ్‌‌సీలకు 10, ఎక్స్‌‌ సర్వీస్‌‌ మెన్‌‌లకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఫీజు: జనరల్​, ఓబీసీలకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌‌సర్వీస్‌‌మెన్ అభ్యర్థులకు రూ.100.

పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్​, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

సెక్షనల్‌‌ కటాఫ్‌‌: ఈ పరీక్షలో ఓవరాల్‌‌ కటాఫ్‌‌తో పాటు సెక్షనల్‌‌ కటాఫ్‌‌ సాధించడం కూడా తప్పనిసరి. ఉదాహరణకు 100 కు 70 మార్కులు సాధించిన అభ్యర్థి ఇంగ్లిష్‌‌ సెక్షన్‌‌లో కటాఫ్ మార్కులు సాధించలేకపోతే టాప్‌‌ మార్కులు వచ్చినా అతడు మెయిన్స్‌‌ పరీక్షకు అర్హుడు కాదు. కాబట్టి అన్ని సెక్షన్స్‌‌లో నిర్దేషించిన కటాఫ్‌‌తో పాటు ఓవరాల్‌‌ స్కోర్‌‌ సాధించేలా ప్రిపేరవ్వాలి. ప్రిలిమ్స్‌‌ మార్కులను మెరిట్‌‌లో కలపరు. మెయిన్స్‌‌ లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఫైనల్‌‌ సెలెక్షన్‌‌ జాబితా రూపొందిస్తారు.

ముఖ్య తేదీలు

దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం:

2019 సెప్టెంబర్ 17

దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరితేది:

2019 అక్టోబర్ 9

ప్రిలిమినరీ పరీక్ష:

2019 డిసెంబర్ 7, 8, 14, 21 తేదీల్లో

మెయిన్ పరీక్ష: 2020 జనవరి 29

వెబ్‌‌సైట్: www.ibps.in

తెలుగు రాష్ర్టాల్లో ఖాళీలు
బ్యాంక్ టీఎస్ ఏపీ
అలహాబాద్ బ్యాంక్ 8 10
ఆంధ్రా బ్యాంక్​ 397 505
బ్యాంక్​ ఆఫ్​ ఇండియా 5 10
బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర 7
కెనరా బ్యాంక్ 20 10
సెంట్రల్​ బ్యాంక్​ 52
కార్పొరేషన్ బ్యాంక్​ 57 88
ఇండియన్​ బ్యాంక్​ 40 110
ఓరియంటల్​ బ్యాంక్​ 7 12
పంజాబ్&సింధ్ బ్యాంక్​ 5 4
యూకోబ్యాంక్​ 2 10
యూనియన్ బ్యాంక్ 11 18
యునైటెడ్​ బ్యాంక్​ 1
మొత్తం 612 777

ఎగ్జామ్‌‌ ప్యాటర్న్

పరీక్ష ప్రిలిమ్స్‌‌, మెయిన్స్‌‌ అనే రెండు దశల్లో జరుగుతుంది. ఇంటర్వ్యూ ఉండదు. ప్రిలిమ్స్‌‌లో అర్హత సాధించిన వారు మెయిన్స్‌‌కు వెళ్తారు. టెస్ట్​ డ్యురేషన్​ ఒక గంట. మెయిన్​ ఎగ్జామ్‌‌లో  200 మార్కులకు నాలుగు సబ్జెక్టుల నుండి 190 ప్రశ్నలొస్తాయి.

ప్రిలిమ్స్

 టెస్ట్                 ప్రశ్నలు  మార్క్స్

ఇంగ్లిష్‌‌ లాంగ్వేజ్​     30         30

న్యూమరికల్‌‌ ఎబిలిటీ            35     35

రీజనింగ్‌‌ ఎబిలిటీ     35         35

మొత్తం                  100       100

Latest Updates