12 వేల క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

డిగ్రీ క్వాలిఫికేషన్ తో పలు బ్యాంకుల్లో ఉద్యోగాలకు ఏటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరానికి కూడా గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది IBPS. 2019-20 సంవత్సరానికి 12075 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపింది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 17 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

డిసెంబర్ 7, 8, 14, 21 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు జరగనుండగా..2020 జనవరి 19న మెయిన్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. 12075 పోస్టులలో ఏపీలో 777, తెలంగాణలో 612 ఉన్నాయి. పూర్తి వివరాల కోసం IBPS అధికారిక వెబ్ సైట్ చూడగలరు.

Latest Updates