లాజిక్​ తెలిస్తే రీజనింగ్​ ఈజీ

  • ఐబీపీఎస్​ క్లర్క్స్​​,ఆర్​ఆర్​బీ ఎన్టీపీసీ ఎగ్జామ్​ స్పెషల్​

ఐబీపీఎస్​, ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ ఎగ్జామ్స్​ ప్రిపరేషన్​లో తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు స్కోర్​ చేయగలిగే సెక్షన్​ రీజనింగ్​. క్వశ్చన్​లో లాజిక్​ పట్టుకోగలిగితే ఆన్సర్​ చేయడం ఈజీ. అలాంటి రీజనింగ్​ చాప్టర్స్​ను ఎలా ప్రిపేరవ్వాలి? ఏయే టాపిక్స్​ నుంచి ఎన్ని ప్రశ్నలొచ్చే చాన్స్​ ఉంది? వేగం.. కచ్చితత్వం ఏలా సాధించాలనే అంశాలపై సబ్జెక్ట్​ ఎక్స్​పర్ట్​ గైడెన్స్​ ఈ వారం..

ఐబీపీఎస్​ క్లర్క్స్​ ప్రిలిమ్స్ ఎగ్జామ్​లో రీజనింగ్​ సెక్షన్ కు సంబంధించి 20 నిమిషాల్లో 35 క్వశ్చన్స్​ సాల్వ్​ చేయాల్సి ఉంటుంది. ​ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి 0.25 కోత ఉంటుంది. ప్రీవియస్​ పేపర్స్​ పరిశీలిస్తే సిలాగిజమ్​ (3–5 ప్రశ్నలు), డైరెక్షన్​& డిస్టాన్స్​(2-–3), సీటింగ్​ అరేంజ్​మెంట్​ & ఫజిల్స్​(15–20), ఇనీక్వాలిటీ(2–3), ఆల్ఫాబెట్​& ఆల్ఫా న్యూమెరిక్​ సింబల్​ సీక్వెన్స్​(3–5), కోడింగ్ & డికోడింగ్​(2–4), ఆర్డర్​ & ర్యాంకింగ్​(2–3) అంశాల నుంచి  ఎక్కువ ప్రశ్నలొస్తున్నాయి. ఎగ్జామినర్​ ఇచ్చే ప్రశ్నను జాగ్రత్తగా చదివి, అందులో ఉన్న లాజిక్​ను పట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి. మిగతా సబ్జెక్టుల్లోగా రీజనింగ్​ టాపిక్స్​ మధ్య ఇంటర్​ లింక్​ ఉండదు. అన్నీ ఇండిపెండెంట్​ అంశాలే. ప్రతి చాప్టర్​లోని కాన్సెప్ట్​లను క్షుణ్ణంగా పూర్తి చేసిన తర్వాత మాక్​ టెస్ట్​లు ప్రాక్టీస్​ చేస్తే  బాగా యూజ్​ ఉంటుంది. ఎగ్జామ్​లో ఈజీ, తక్కువ సమయం తీసుకునే సమస్యలతో మొదలుపెట్టి లెన్తీ, డిఫికల్ట్​ ప్లాబ్లమ్స్​ వైపు వెళ్లాలి. వేగం, కచ్చితత్వంల మధ్య సమన్వయం సాధిస్తే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులను స్కోర్​ చేయొచ్చు. అందుకు ప్రాక్టీస్​ చాలా ముఖ్యం.

సీటింగ్​ అరేంజ్​మెంట్​& ఫజిల్​: సీటింగ్​ అరెంజ్​మెంట్స్​ & ఫజిల్​ టాపిక్​ ఇంపార్టెంట్​. ఇందులో ఒక్కో సెట్​లో 5 ప్రశ్నలు ఉండేలా 3 నుంచి 4 సెట్లు వస్తాయి. సర్క్యులర్​, రో, అన్​సర్టేయిన్, బాక్స్​, ఫ్లోర్​, ఫ్లాట్​ + ఫ్లోర్​, డే/మంత్​/ఇయర్​, 3 వేరియేబుల్స్​ తదితర రకాల సమస్యలు వస్తాయి. స్టేట్​మెంట్​లోని డైరెక్ట్​ ఇన్ఫర్మేషన్​తో ప్రశ్నను బట్టి ఒక డయగ్రామ్​ గీసి సమాచారాన్ని అందులో పొందుపరచాలి. చివరగా ఇండైరెక్ట్​ ఇన్ఫర్మేషన్​ ను జాగ్రత్తగా అందులో సరిపోయేటట్లు అమరిస్తే సమస్య పూర్తవుతుంది.

EX: Study the information and answer the questions

There are seven persons i.e A, B, C, D, E, F & G. They all belongs to different cities i.e Kolkata, Mubai, Chennai, Pune, Lucknow, Ahmedabad & Delhi but necessarily in the same order. D belongs to Pune, Neither A  nor F belongs to Kolkata. B belongs Ahmedabad. C does not belongs to Kolkata & Lucknow. G belongs to Mumbai. A does not belongs to Lucknow & Chennai

Q:. Who among the following belongs to Kolkata ?

. a) A        b) D       c) F        d) G          e) None of  these

రక్త సంబంధాలు: బ్లడ్​ రిలేషన్స్​ టాపిక్​కు సంబం ధించి విభిన్న సంబంధాలకు భిన్న గుర్తులను ఉపయోగించి ఫ్యామిలీ ట్రీ గీస్తే ప్రశ్న ఏరకంగా ఇచ్చినా ఈజీగా సాల్వ్​ చేయొచ్చు. సమస్య సాధన క్రమంలో కన్ఫ్యూజన్​ రాకుండా  ‘+’ ను మగవారిగా, ‘–’ ను ఆడవారిగా, ‘<=>’ ను భార్యాభర్తలుగా, ‘<–>’ సోదరీ సోదరులుగా రిలేషన్స్​ సూచించడానికి ఉపయోగిస్తారు.

EX: Study the information and answer the questions

There are seven members in a family of 3 generations. A is mother of P. P is brother of G. K is married to G. S is aunt of M. K is child of  L. S is sister of K

Q:. How S is related to G ?

. a) Sister                b) Sister in law

. c) Aunt                 d) Mother in law

. e) None

డైరెక్షన్​ & డిస్టాన్స్​: డైరెక్షన్​ & డిస్టాన్స్​ సెక్షన్​ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్​ సాల్వ్​ చేయడానికి దిక్కులు, క్లాక్​ వైజ్​ & యాంటి క్లాక్​వైజ్​ డైరెక్షన్​, కోణాలు, ఫైథాగరస్​ సిద్ధాంతంపై అవగాహన ఉండాలి. అందుకు సిలబస్​లో  ఇచ్చిన ప్రతి టాపిక్​ను క్షుణ్నంగా చదవాలి.

సిలాగిజమ్​: రీజనింగ్​ సెక్షన్ కు సంబంధించి సిలాగిజమ్​ చాప్టర్​లో 3 నుంచి 5 ప్రశ్నలు వచ్చే చాన్స్​ ఉంది.  వెన్​ డయాగ్రామ్​లను ఉపయోగించి సిలాగిజమ్​ సమస్యలు సాధిస్తే కరెక్ట్​ ఆన్సర్​ పట్టుకోవచ్చు. ఇచ్చిన అన్ని స్టేట్​మెంట్లను జాగ్రత్తగా చదివి కన్​క్లూజన్స్​ వాటికి సరిపోతాయో లేదో పోల్చుకోవాలి.

EX:  Answer the fallowing

. a) If only I follows

. b) If only II follows

. c) Either I or II follows

. d) Neither I nor II follows

. e) Both I&II follows

Statement:

. All Tennis is Football

. All Football is Basketball

. No Basketball is Cricket

Conclusion:

. I No Football is Cricket

. II All tennis is Foot ball

ఇన్​ఈక్వాలిటీ:  ఈ సమస్యలు సాధించడానికి >, ³ లేదా <, £ ల మధ్య ప్రాధాన్యతాక్రమం గుర్తించాలి.

Ex: Which of the following will be definitely true for

T³U³M=N<J = P<Q£R

. a) T<J     b) U>M

. c) R>N    d) R³M  e) T<P

ఆర్ఆర్బీ ఎన్టీపీసీ(సీబీటీ–1)

ఆర్​ఆర్​బీ ఎన్టీపీసీ ఎగ్జామ్​కు సంబంధించి సీబీటీ–1లో రీజనింగ్​ నుంచి 30 ప్రశ్నలొస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్క్​ ఉంటుంది. తప్పు సమాధానానికి వన్​ థర్డ్​ మార్క్​ కోత విధిస్తారు. ఎన్టీపీసీ ఎగ్జామ్​లో రీజనింగ్​ సెక్షన్​కు సంబంధించి వేగం కంటే కచ్చితత్వానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. అనాలజీ & క్లాసిఫికేషన్​(3–5 ప్రశ్నలు), కోడింగ్​ & డికోడింగ్​(3–4), వెన్​డయాగ్రామ్స్​(2–3), బ్లడ్​ రిలేషన్స్​(2–3), సిలాగిజమ్​(2–3), మ్యాథమెటికల్​ ఆపరేషన్స్​(2–4), సీటింగ్​ అరేంజ్​మెంట్స్​ & ఫజిల్స్​(3–4), సిరీస్​(2–3), స్టేట్​మెంట్​– కన్​క్లూజన్ & అజ్యంప్సన్స్​ (2–4), మిస్సింగ్​ నెంబర్స్​(1–2), క్లాక్స్​ & క్యాలెండర్స్​ (0–2), క్యూబ్స్​ & డైస్​(1–2) టాపిక్స్​ నుంచి ప్రశ్నలొస్తాయి.  ​వీటిలో అనాలజి & క్లాసిఫికేషన్​, కోడింగ్​ & డికోడింగ్​ చాప్టర్స్​ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే ఛాన్స్​ ఉంది. కాబట్టి వాటిని బాగా ప్రిపేరవ్వాలి.

మోడల్ క్వశ్చన్స్

1.. పరీక్ష: విజయం:: ఆట:………..

. a) క్రికెట్​                 b) తయారు

. c) ప్రయత్నం          d) గెలుపు

2.. కిందివానిలో విభిన్నంగా ఉన్నది…….?

. a) I          b) N       c) V        d) H

3.. 6, 12, 32, 42 ,56, 72  శ్రేణిలో తప్పుడు సంఖ్య ఏది?

. a) 20       b) 56      c) 72       d) 32

4.. ఒక కోడ్​ భాషలో UNGIMMICKYL ను MIGNUYKCIM గా రాస్తే అదే భాషలో COMPLEXITY ను ఎలా రాస్తారు?

. a) LPMOOCYTIXE

. b) LPMOYCTIXE

. c) LPOMCYTIXE

. e) LPMOCYTIXE

5.. (14*9*6)*15*8 లోని * స్థానంలో ఏ గణిత గుర్తులను వరుస క్రమంలో అనుసరిస్తే సమీకరణం సరైనది అవుతుంది?

. a) ÷, –, =, x          b) x, –, ÷,=

. c) x, =, ÷, –,         d) –, ÷, x, =

6.. కింది వెన్​చిత్రం​లో P మాంసాహార, Q మొక్కలు, R పచ్చనివి సూచిస్తే.. మాంసాహార మొక్కలు పచ్చనివి కానివి ఏవి?

. a) d         b) g        c) e         d) f

Latest Updates