బ్యాంకు ఉద్యోగాలకు ఐబీపీఎస్ నోటిఫికేషన్

గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు

తెలంగాణలో – 470,  ఏపీలో  – 429

దేశవ్యాప్తంగా ఉన్న 45 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 9638 పోస్టు ల భర్తీకి కోర్సులు ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 4500 లకు పైగా ఆఫీస్ అసిస్టెంట్, 3800 స్కేల్‌-I ఆఫీసర్, 1000 పైగా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలున్నాయి. తెలంగాణాలో 470, ఏపీలో 420 పోస్టు లున్నాయి. ఈ నెల 21 వరకు ఆన్‌‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు మొదటి వారంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది.

ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్​(ఐబీపీఎస్) దేశ వ్యాప్తంగా ఉన్న 45 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 9638 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 4500లకు పైగా ఆఫీస్ అసిస్టెంట్, 3800 స్కేల్‌‌-I ఆఫీసర్,  వెయ్యికి పైగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులున్నాయి. ఈనెల 21 వరకు ఆన్‌‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు ఒకటి నుండి ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. లాక్‌డౌన్ కారణంగా  దాదాపు నాలుగు నెలల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పోటీ తీవ్రంగా ఉంటుంది. పక్కాగా ప్రిపేరయితే ఒక పోస్టు సొంతం చేసుకోవచ్చు.

ఐబీపీఎస్​ ఈ నోటిఫికేషన్​ ద్వారా మల్టి పర్పస్​ ఆఫీస్​ అసిస్టెంట్​, ఆఫీసర్​ స్కేల్​–I, ఆఫీసర్​ స్కేల్–II (అగ్రిక ల్చర్​ ఆఫీసర్, మార్కెటిం గ్ ఆఫీసర్​, ట్రెజరీ మేనేజర్​, లా ఆఫీసర్​, చార్టడ్ అకౌంటెంట్​, ఐటీ, జనరల్ బ్యాంకింగ్ ​ఆఫీసర్​), ఆఫీసర్ ​స్కేల్​–IIIపోస్టులను భర్తీ చేస్తుంది. మన రాష్ర్టంలో 470, ఏపీలో 320 జాబ్​లున్నాయి. మల్టి పర్పస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-I కి ఎక్స్ పీరియన్స్ అవసరం లేదు. కానీ మిగిలిన పోస్టులకు ఒకటి నుంచి 5 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండాలి . ప్రాంతీయ భాషపై అవగాహనతో పాటు కంప్యూటర్ ​ప్రొఫీషియన్సీ తప్పనిసరి. సెలెక్షన్ ప్రాసెస్ ఆఫీస్ ​అసిస్టెంట్స్, ఆఫీసర్ ​స్కేల్​–I పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్​, స్కేల్​–II, I​II కి ఒకే దశలో నిర్వహించే ఆన్​లైన్​ టెస్టు ఉంటుంది. మల్టిపర్పస్ ​ఆఫీస్​ అసిస్టంట్, ఆఫీసర్ స్కేల్–I పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్ష 45 నిమిషాలకు, మెయిన్​ ఎగ్జామ్​ 2గంటలకు ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్ష్లి​ష్,  హిందీలో ఇస్తారు. నెగెటివ్​ మార్కింగ్ ఉంది. తప్పు సమాధానానికి ¼ మార్కు  మైనస్ ​అవుతుంది. సింగిల్ లెవెల్ ఎగ్జామ్ లో అభ్యర్థులు ఇంగ్లిష్ లేదా హిందీలో ఒక సబ్జెక్టు ఎంచుకోవచ్చు. సెక్షనల్ కటాఫ్ ఉంది. ప్రిలిమ్స్ లోని ప్రతి సెక్షన్ లో క్వాలిఫై కావాలి. ఆఫీస్ అసిస్టెంట్,  స్కేల్–I ఆఫీసర్ పోస్టులకు ప్రశ్నాపత్రం  తెలుగులో ఇస్తారు.  స్పెషల్ టాపిక్స్ బ్యాంకింగ్ అవేర్ నెస్  ఈ సెక్షన్లో ఫైనాన్సియల్​ మార్కెట్స్​, సర్ఫిటికెట్ ఆఫ్ ​డిపాజిట్స్, బ్యాంక్ ​ఇన్సూరెన్స్, లెటర్ ​ఆఫ్ ​ క్రెడిట్, మనీ మార్కెట్స్, మనీ ఫంక్షన్స్ అండ్ ​ టైప్స్, బ్యాంక్ ​లోన్స్ అండ్ ​డిపాజిట్స్​, పథకాలు, టైప్స్ ఆఫ్​ అకౌంట్స్, క్యాపిటల్​ అండ్​ మనీ మార్కెట్ ఇన్​స్ర్టూమెంట్స్,  పి నోట్స్, ఇండియన్​ ఫైనాన్షియల్​ సిస్టమ్​, స్ర్ట క్చర్ ​ఆఫ్ ​బ్యాంకింగ్​, రీటెయిల్ ​బ్యాంకింగ్​, బ్యాంక్​ టెర్మ్స్​,  బ్యాంకింగ్ అండ్​ నాన్​ బ్యాంకింగ్ సంస్థలు, ఆర్​బీఐ, నాబార్డ్,  బ్యాంకింగ్​ కమిటీలు, మ్యూచ్​వల్ ​ఫండ్స్, ఈ పేమెంట్​ సిస్టమ్స్ వంటి కొన్ని వందల టాపిక్​ల నుంచి ప్రశ్నలిస్తారు. ఇందుకు ఏదైనా స్టాండర్డ్ పుస్తకం ప్రిపేరవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ల పరిచయం, వాటి చరిత్ర, కంప్యూటర్ ​ టెర్మినాలజీ, అబ్రివేషన్స్, వెబ్​ టెక్నాలజీ, డేటాబేస్ మేనేజ్​మెంట్ ​సిస్టమ్స్, బ్రౌజర్స్ అండ్​ సెర్చ్ఇంజిన్స్, ఇంటర్​నెట్​, సాఫ్ట్‌వేర్స్ అండ్​ అప్లి కేషన్స్, కంప్యూటర్ మెమొరీ, హార్డ్​వేర్​,  సాఫ్ట్ వేర్​, మొబైల్ ​అప్లి కేషన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూ టర్ ​షార్ట్ క‌ట్స్, ఎంఎస్‌‌ ఆఫీస్‌‌, వర్డ్,  ఎక్సెల్ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అగ్రికల్చర్ బ్యాంకింగ్ ​ఇండస్ర్టీ తో ముడిపడి ఉన్న అగ్రికల్చర్ లోన్ ​సిస్టమ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్, క్రాప్​ సీజన్స్, అగ్రికల్చర్​స్కీమ్స్ వంటి టాపిక్​ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ప్రీవియస్​ పేపర్లలో వచ్చిన టాపిక్​లలో లేటెస్ట్ అంశాలు అధ్యయనం చేయాలి. మార్కెటింగ్ బ్యాంకింగ్ ​ఇండస్ర్టీ లో వస్తున్న మార్పులు, లేటెస్ట్ డెవలప్​మెంట్స్ గమనించాలి. బ్యాంక్ ​ప్రొడక్టులు, సర్వీస్​లను వినియోగదారులకు చేరవేసే మార్కెటింగ్​ విధానాలు, కస్టమర్లను ఆకట్టుకునే పథకాలు, బ్యాంక్ లో లభిస్తున్న సర్వీసులు–ఉపయోగాలు వంటి వాటిని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.ముఖ్యంగా రూరల్​ ఏరియాల్లో వినియోగించాల్సిన మార్కెటింగ్ స్ర్టాటజీస్ మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

బ్యాంకింగ్ లా

ఇందులో బ్యాంకింగ్ చట్టాలు, నెగోషియబుల్ ​ఇన్​ స్ర్టుమెంట్ ట్యాక్స్ ట్, అగ్రికల్చర్​ చట్టాల తోపాటు వినియోగదారుల చట్టాలు, ఫోరమ్స్ , కంపెనీ యాక్ట్, బ్యాంకింగ్ అంబుడ్స్ మన్​, మనీ లాండరింగ్ యాక్ట్, ఐటీ చట్టం 2000, ఫారెన్ ​ఎక్స్ చేంజ్ ​యాక్ట్ కాంట్రాక్ట్ ఆఫ్​ గ్యారంటీ, టైప్స్ ఆఫ్ కంపెనీస్​, పార్టనర్​షిప్ ​యాక్ట్స్ లాంటి రిలేటెడ్​ అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.  వీటితో పాటు ఐటీ, సీఏ వంటి స్పెషలైజేషన్లకు ఆయా సబ్జెక్టుల్లో బ్యాంక్​రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ​ప్రిపేరయితే మంచి మార్కులు పొందవచ్చు. ఇవి గుర్తుంచుకోండి ఏ బ్యాంక్​పరీక్షలోనైనా దాదాపు ఒకే సబ్జెక్టులు ఒకే సిలబస్‌‌‌‌ను కలిగి ఉంటాయి. కాబట్టి ఓరియంటేషన్​మార్చి సిద్ధమైతే దాదాపు అన్ని ఎగ్జామ్స్ రాయవచ్చు. పరీక్షకు నెల రోజుల సమయం మాత్రమే ఉన్నందున సిలబస్‌‌‌‌ను పూర్తిగా అవగాహన చేసుకొని ప్రణాళికా ప్రకారం సిద్ధమవ్వాలి. ఏ సబ్జెక్టులో ఏ చాప్ట ర్స్‌ ఉన్నాయి? వాటిలో సబ్‌‌‌‌ టాపిక్స్ ఏంటి? అందులో ఉన్న స్పెషల్‍ మెథడ్స్ వంటి అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. గంటలోపే 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్‌, రీజనింగ్‌‌‌‌లో వేగంగా ఆన్సర్స్ రాయగలిగేలా ప్రాక్టీస్‍ చేయాలి. తద్వారా లాజికల్‍గా ఆలోచించడం, ఖచ్చితత్వంతో కూడిన వేగం సాధ్యమవుతుంది. సీనియర్లు, అధ్యాపకుల సలహాలు, ఇంటర్‌‌‌‌నెట్‌‌‌‌ రివ్యూలు వంటి అధ్యయనం తర్వాత పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి. వీలైనన్ని ప్రీవియస్‌‌‌‌ పేపర్స్‌‌‌‌ ప్రాక్టీస్‍ చేయాలి.  గ్రూప్‍లుగా చదవడం వల్ల ఎక్కువ విషయాలు గుర్తుంచుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ పుస్తకాలు చదవడం కంటే ఒకే పుస్తకాన్ని ఎక్కువసార్లు చదవడం అనేది పరీక్షలో సక్సెస్‍కు మొదటిమెట్టు.

చదవాల్సిన పుస్తకాలు క్వాంటిటేటివ్‌‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ రీజనింగ్‌‌:

ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ గులాటి పుస్తకాలు ఇంగ్లిష్: హరి మోహన్‌‌‌‌ ప్రసాద్‌, ఏకే కపూర్‌‌‌‌ పుస్తకాలు

జనరల్‌ అవేర్‌‌నెస్‌‌: అరిహంత్‌, లుసెంట్‌‌‌‌ పబ్లికేష న్స్‌ జనరల్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌ బుక్స్‌

కంప్యూటర్‌ నాలెడ్జ్‌: ఉపకార్‌‌‌‌ పబ్లి కేషన్స్‌,ఆర్‌‌‌‌ పిళ్లై పుస్తకాలు ప్రీవియస్‌ పేపర్స్‌‌: కిరణ్‌ ప్రకాశన్‌‌‌‌ సా ల్వ్‌‌‌‌డ్‌‌‌‌ ప్రీవి యస్‌‌‌‌ పేపర్స్‌ .

ఖాళీలు

ఆఫీస్ అసిస్టెంట్ (మల్టిపర్పస్) 4624

ఆఫీసర్ స్కేల్-II   3800

ఆఫీసర్ స్కేల్-II  1058

ఆఫీసర్ స్కేల్- III  156

మొత్తం 9638

వెలుగు,  ఎడ్యుకేషన్ డెస్క్.

Latest Updates