గుండెపోటుతో ఏఎస్సై మృతి

ibrahim-patnam-asi-dead-in-heart-attack

ఇబ్రహీంపట్నం,వెలుగు: గుండెపోటుతో ఇబ్రహీంపట్నం పీఎస్ లో విధులు నిర్వహించే ఏఆర్ ఏఎస్సై శనివారం చనిపోయాడు. వివరాల్లోకి వెళితే..వరంగల్ జిల్ల హన్మకొండకి చెందిన పాపయ్య(56) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఏఆర్ ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం పోలీస్ క్వార్టర్స్ లో విశ్రాంతి తీసుకుంటున్న పాపయ్యకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే పడిపోయాడు. క్వార్టర్స్ లో పాపయ్య ఒక్కడే ఉండటంతో ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. డ్యూటీకి టైం కావడంతో తోటి పోలీసులు పాపయ్య ఫ్లాట్ దగ్గరికి వెళ్లారు. అక్కడ పాపయ్య పడిపోయి ఉండటాన్ని గమనించిన వారు వెంటనే అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే పాపయ్య చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు.

Latest Updates