సీఏ ప‌రీక్ష‌లు మ‌రోసారి వాయిదా

సీఏ ప‌రీక్ష‌లు మ‌రోసారి వాయిదా ప‌డ్డాయి. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం, లాక్ డౌన్ క్ర‌మంలో జూన్ 19 నుంచి జూలై 4 వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) గ‌తంలో తెలిపింది. అయితే ఇప్పుడు మ‌రోసారి లాక్ డౌన్ పొడిగించిన క్ర‌మంలో ప‌రీక్ష‌ల‌ను మ‌రోసారి వాయిదా వేసిన‌ట్లు ప్ర‌క‌టించిన ఐసీఏఐ.. కొత్త షెడ్యూల్ ను వెల్ల‌డించింది.

జూలై 29 నుంచి ఆగ‌స్టు 16 వ‌ర‌కు సీఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. ఈ విష‌యాన్ని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. రీషెడ్యూల్ కు సంబంధించిన వివ‌రాల‌ను క్లారిటీగా చెప్పింది. అభ్య‌ర్థులు వీటిని పాటించి కొత్త ప‌రీక్ష తేదీల‌ను గుర్తుంచుకోవాల‌ని సూచించింది ఐసీఏఐ.

Latest Updates