ICC కంటే IPLలే బెటర్ : మహిళా క్రికెటర్లకు ఇదేమి సత్కారం అంటూ చిర్రుబుర్రులు

ICCఅదొక ఇంటర్నేషనల్ మ్యాచ్. మ్యాచ్ లో అదరగొట్టిన ప్లేయర్లకు ఇచ్చే (మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్) రివార్డు చూస్తే అవాక్కు అవుతారు. మలేసియాలో జరుగుతున్న ఆసియా కప్ ఉమెన్స్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌ లో టీమిండియా వరసగా రెండో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచుల్లో బాగా రాణించిన భారత మహిళా ప్లేయర్లకు అవార్డులు దక్కాయి. ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. ఇక్కడే ఇష్యూ అయ్యింది.

మలేషియాతో మ్యాచ్‌ లో మిథాలీరాజ్, థాయ్‌ లాండ్‌ తో మ్యాచ్‌ లో హర్మన్‌ ప్రీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. ఇద్దరికీ ప్రైజ్ మనీ రూపంలో 250 అమెరికన్ డాలర్లు( రూ.16,778) అందజేశారు. దీంతో ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్‌ లో అతి తక్కువ మొత్తంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రోత్సాహకాలు ఇవ్వడంపై మండిపడుతున్నారు నెటిజన్లు. IPLలోనూ అద్బుత ప్రదర్శన చేసిన ప్లేయర్లూ, బెస్ట్ క్యాచ్, బెస్ట్ ఫీల్డర్, బౌలర్, బ్యాట్స్‌ మన్‌ కు కూడా కనీసం రూ.లక్ష రూపాయల చెక్ అందజేస్తున్నారని.. అలాంటిది ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఇంత తక్కువ అమౌంట్ ఇస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు. ICC కంటే IPL లే బెటరని, ఇండియన్ ప్లేయర్లను చిన్నచూపు చూస్తున్నారని, అందులోనూ మహిళా టీమ్ అని చులకనా అని చురకలంటిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates