ICC కి నో చెప్పిన BCCI

icicic-bcciఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్ లు  ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఓ విజ్ఞప్తి చేసింది. ఏప్రిల్ 22 నుంచి 26 వరకు కోల్‌కతాలో ICC వార్షిక సమావేశం జరుగనుంది. ఈ క్రమంలో ఆయా తేదీల్లో జరిగే IPL మ్యాచ్ లను కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించాలంది. ఆ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులు IPL  చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. ఆయా తేదీల్లో హైదరాబాద్, ముంబై, ఇండోర్, బెంగళూరు, జైపూర్‌ల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్  ఇన్ ఇండియా(BCCI) ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీంతో షెడ్యూల్‌లో మార్పులు చేస్తే ఇబ్బందులు వస్తాయని భావిస్తోంది. దీంతో మ్యాచ్ షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు చేయబోమని ICC కి తేల్చి చెప్పింది BCCI.

Posted in Uncategorized

Latest Updates