ICC డైరెక్టర్‌గా ఇంద్రా నూయీ

INDRAపెప్సి కో చైర్మన్, సీఈవో ఇంద్రా నూయీ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) తొలి మహిళా స్వతంత్ర డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. శుక్రవారం (ఫిబ్రవరి-9) ఆమె నియామకం ఖరారైంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ మార్కెట్‌ను విస్తృతం చేసే ఉద్దేశంతో గతేడాది జూన్‌లో ఐసీసీ నియమావళిలో భారీ సంస్కరణలు చేపట్టారు. దీనిలో భాగంగా బోర్డులో తప్పనిసరిగా ఒక మహిళా స్వతంత్ర డైరెక్టర్‌ ఉండాలని సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. రెండేళ్ల ఈ పదవీ కాలానికి గానూ ఇంద్రా నూయీ ఈ ఏడాది జూన్‌ నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు.

తాను తొలి మహిళా స్వతంత్ర డైరెక్టర్‌గా ఎన్నిక కావడం పట్ల ఇంద్రా నూయీ హర్షం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఇంద్రా నూయీకి ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ అభినందనలు తెలిపారు.

ప్రస్తుతానికి స్వతంత్ర డైరెక్టర్‌ పదవి రెండేళ్ల పాటు ఉంటుంది. దీనిని వరుసగా రెండు దఫాల్లో ఆరేళ్ల వరకు పొడిగించుకోవచ్చు.

 

Posted in Uncategorized

Latest Updates