ICC ర్యాంకింగ్స్ : కోహ్లి నంబర్ 1.. రోహిత్ నంబర్ 2

ఏషియా కప్ గెలిచిన ఊపులో ఉన్న టీమిండియా స్టాండిన్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్‌శర్మ ICC ర్యాంకింగ్స్‌ లోనూ దూసుకెళ్లాడు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ICC ర్యాంకుల్లో రోహిత్ రెండో స్థానానికి వచ్చాడు. వన్డే ర్యాంకుల్లో రోహిత్ రెండో స్థానానికి రావడం ఇది రెండోసారి. లేటెస్ట్ ర్యాంకింగ్స్‌ లో కోహ్లి నంబర్ వన్‌ లో ఉండగా.. రోహిత్ నంబర్ -2లో ఉండటం విశేషం.

ఏషియాకప్‌ లో 317 రన్స్ చేయడంతో పాటు ..ఈ ట్రోఫీ ఏడోసారి గెలవడంలో రోహిత్ కీలకపాత్ర పోషించాడు.  మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 4 స్థానాలు ఎగబాకి.. ఐదోస్థానానికి చేరుకున్నాడు. ఈ టోర్నీలో ధావన్ 342 రన్స్ తో టాప్ స్కోరర్‌ గా నిలిచాడు.

బౌలింగ్ ర్యాంకుల్లో కుల్‌దీప్ యాదవ్ కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్‌కు రావడం విశేషం. ఏషియాకప్‌ తో తర్వాత అతడు మూడు ర్యాంకులు మెరుగు పరచుకున్నాడు.  ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ బౌలర్ల లిస్ట్‌ లో రెండోస్థానానికి, ఆల్‌ రౌండర్ల లిస్ట్‌ లో టాప్ ప్లేస్‌ కు చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్ఘన్ ప్లేయర్‌ గా అతడు నిలిచాడు.  ఫైనల్లో ఇండియాపై సెంచరీ చేసిన బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ .. 107 స్థానాలు ఎగబాకడం విశేషం. ప్రస్తుతం అతడు 116వ స్థానంలో ఉన్నాడు.

Posted in Uncategorized

Latest Updates