ICC వన్డే ర్యాంకింగ్స్ లోకి మరో నాలుగు జట్లు

iccaఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సెల్ (ICC) వన్డే ర్యాంకింగ్స్ లిస్టులో మరో నాలుగు జట్లు చోటు దక్కించుకున్నాయి. మెన్స్ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇప్పటి వరకు 12 జట్లు స్థానం దక్కించుకున్నాయి. తాజాగా నేపాల్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, యూఏఈ జట్లను పాయింట్ల పట్టికలో చేర్చినట్లు ICC శుక్రవారం( జూన్-1) తెలిపింది.

వన్డే హోదా సాధించిన వాటిలో స్కాట్లాండ్ (28 పాయింట్లు) 13వ ర్యాంక్.. యూఏఈ(18పాయింట్లు) 14వ ర్యాంక్ సాధించింది. నేపాల్, నెదర్లాండ్స్ జట్లు చెరో నాలుగు మ్యాచ్‌లు ఆడిన తరువాత పాయింట్ల పట్టికలో పూర్తిస్థాయి ర్యాంకింగ్‌ను పొందనున్నాయి.

Posted in Uncategorized

Latest Updates