విండీస్ క్రికెటర్లకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్

బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్’ లోగోతో బరిలోకి

న్యూఢిల్లీ: జాతి వివక్ష ఎదుర్కొంటున్న వారికి మద్ద-తుగా నిలిచేం దుకు వెస్టిండీస్ క్రికెట్​ టీమ్​ వినూత్న నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 8 నుంచి ఇంగ్లండ్ తో జరిగే మూడు మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్ లో ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ’ లోగోతో బరిలోకి దిగనుంది. ఈ మేరకు ఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విం డీస్ క్రికెటర్లు ధరించే జెర్సీల కాలర్ పై దీనిని ప్రత్యేకంగా ముద్రిం-చారు. ప్రముఖ డిజైనర్ అలీషా హోసన్నా ఈ లోగోను రూపొందించింది. జాతి వివక్షకు అపోజిట్​గా పోరా-డేం దుకు స్పోర్ట్స్​ హిస్టరీతో పాటు క్రికెట్​, విండీస్ టీమ్​కు ఇదో కీలక ఘట్టమని కెప్టెన్ జేసన్ హోల్డర్ అన్నాడు. ఇప్పటికే ప్రీమియర్ లీగ్ కు చెందిన 20 ఫుట్​బాల్ క్లబ్స్ ఈ లోగోను ధరించి రేసిజంకు వ్యతిరేకంగా తమ మద్దతు తెలుపుతున్నాయి.
ఎఫ్‌‌1లో మెర్సిడెస్‌‌ కారుకు బ్లాక్‌‌ కలర్‌‌
ఫార్ములా వన్‌‌ టీమ్‌ మెర్సిడెస్‌‌ కూడా రేసిజంకు వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకుం ది. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ’కు మద్దతుగా తమ కారు కలర్‌‌‌‌ను మార్చు-కుం ది. 2020 సీజన్‌‌కు గాను బ్లాక్‌‌ కలర్‌‌తో కూడిన కొత్త కారు సోమవారం రిలీజ్‌‌ చేసింది. ఎఫ్‌ 1లో ఏకైక బ్లాక్‌‌ డ్రైవర్‌‌గా ఉన్న మెర్సిడెస్‌‌ స్టార్‌‌ రేసర్‌‌ లూయిస్‌‌ హామిల్టన్‌‌ రేసిజానికి వ్యతిరేకంగా గళం విప్పాడు. మోటార్‌‌ రేసింగ్‌‌ ఫీల్డ్‌‌లో కి మరింత మంది బ్లాక్‌‌ యంగ్‌‌స్టర్స్‌‌ను తీసుకొచ్చేందుకు ఓ కమిషన్‌‌ను కూడా ఏర్పాటు చేశాడు

.

Latest Updates