టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా

ప్రకటించిన ఐసీసీ
ఐపీఎల్‌–13కు లైన్‌ క్లియర్ ‌
మూడు మెగా ఈవెంట్ల షెడ్యూల్స్‌లో మార్పు

దుబాయ్‌: ఓవైపు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ రీ స్టార్ట్‌ అయినా..కరోనా దెబ్బకు ఓ పెద్ద ఈవెంట్‌‌ మాత్రం ఆగిపోయింది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ ‌కప్‌‌ను ఐసీసీ ఎట్టకేలకు పోస్ట్‌పోన్ ‌‌చేసింది. సోమవారం సమావేశమైన ఐసీసీ బోర్డు.. సుదీర్ఘ చర్చల తర్వాత మెగా ఈవెంట్‌‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం టీ20వరల్డ్ ‌కప్ ‌‌అక్టోబర్ ‌‌18 నుంచి నవంబర్‌‌15 వరకు జరగాల్సి ఉంది. ఇక కరోనా కారణంగా ఆగి పోయిన బై లేటరల్‌ సిరీస్‌‌ల నిర్వహణకు ఆటంకం కలగకుండా తర్వాతి మూడు వరల్డ్ ‌కప్‌‌ల షెడ్యూల్లో కూడా స్వల్పంగా మార్పులు చేసింది. ఆయా టోర్నీల ఆతిథ్య హక్కులు కలిగిన దేశాలు ఈ నిర్ణ‌యానికి అంగీకరించాయని ఐసీసీ వెల్లడించింది. అయితే వచ్చే ఏడాది న్యూజిలాండ్ ‌‌వేదికగా జరగాల్సిన మహిళల వన్డే వరల్డ్ కప్‌‌ విషయంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ప్రస్తుతానికి పాత షెడ్యూల్‌‌ను కొనసాగిస్తామని, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన నిర్ణ‌యాలు తీసుకుంటామని వెల్లడించింది. ‘ఇప్పుడున్న పరిస్థితులను అంచనా వేసి, అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే టీ20 వరల్డ్‌కప్ ‌‌వాయిదా వేశాం.

క్రికెట్‌‌తో సంబంధం ఉన్న ప్రతిఒక్కరిహెల్త్‌, సేఫ్టీని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణ‌యానికి వచ్చాం. స్టేక్‌‌హోల్డర్లు, బోర్డు మెంబర్స్ ,బ్రాడ్ ‌‌కాస్టర్స్ , గవర్నమెంట్స్‌‌తో చర్చించిన తర్వాతే వాయిదాకు మొగ్గు చూపాం. ఈ నిర్ణ‌యం క్రికెట్‌‌ ఫ్యాన్స్‌కు మేలు
చేస్తుందని ఆశిస్తున్నాం. ఫ్యూచర్‌‌లో వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్‌‌లను నిర్వహిస్తాం. మెగా ఈవెంట్‌‌ను వాయిదా వేయడం వల్ల ఏర్పడిన విండో..మిగతా టోర్నీలకు ఉపయోగపడుతుంది. బై లేటరల్‌ లేదా డొమెస్టిక్ ‌‌టోర్నీలను నిర్వహించుకోవడానికి దీనిని అన్ని దేశాలు ఉపయోగించుకో వచ్చు’ అని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ ‌‌మను సావ్నే పేర్కొన్నారు. అయితే రెండు టీ20 వరల్డ్ క‌ప్స్ ఏ ఆర్డర్లో ఇండియా, ఆస్ట్రేలియాలో జరుగుతాయనే అంశంపై ఐసీసీ క్లారిటీ ఇవ్వలేదు.

మూడు షెడ్యూల్స్‌లో మార్పులు

కరోనాతో దెబ్బతిన్న క్యాలెండర్‌‌ను సరిచేసేందుకు 2021 (టీ20), 2022 (టీ20), 2023 (వన్) డే వరల్డ్ ‌కప్ ‌‌షెడ్యూల్స్‌లో మార్పులు చేశారు. క్వాలిఫికేషన్‌‌ విధానాన్ని పెంచేందుకు వీలుగాఈ నిర్ణ‌యం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్‌ ప్రకారం మెన్స్‌
ఈవెంట్స్‌ ఇలాజరుగుతాయి.
2021 ఇండియాలో జరగాల్సిన మెన్స్‌ టీ20 వరల్డ్‌కప్‌‌..అక్టోబర్‌‌–నవంబర్‌‌లో జరుగుతుంది. నవంబర్‌‌14నఫైనల్‌ఉంటుంది.
2022 మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ అక్టోబర్‌‌–నవంబర్‌‌లోనే ఉంటుంది. నవంబర్ ‌‌13న ఫైనల్ ‌మ్యాచ్ ‌‌జరుగుతుంది.
2023 మార్చి.. ఇండియాలో జరగాల్సిన మెన్స్‌ వన్డే వరల్డ్‌కప్‌‌ను అక్టోబర్‌‌–నవంబర్‌కు మార్చారు. నవంబర్‌‌26న ఫైనల్‌‌తో ముగుస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates