గేమ్ ఛేంజర్స్..మరో రెండు రోజుల్లో మహిళల టీ20వరల్డ్ కప్

అసలే ధనాధన్‌‌ ఫార్మాట్‌‌.. ఆపై టీ20 వరల్డ్‌‌కప్‌‌..! ఇక అభిమానుల ఆశలకు, ఉత్సాహానికి అంతే ఉండదు..! అది మెన్స్‌‌అయినా.. వుమెన్స్‌‌టోర్నీ అయినా.. ప్రతి టీమ్‌‌లో ఎవరో ఒకరు గేమ్‌‌ఛేంజర్‌‌ఉండనే ఉంటారు..! అయితే మెన్స్‌‌టోర్నీకి ఇంకాస్త సమయం ఉన్నా.. ఇప్పటికైతే అమ్మాయిల అసలు సమరానికి టైమొచ్చేసింది..! మరో 2 రోజుల్లో మొదలయ్యే ఈ మెగా ఈవెంట్‌‌లో ప్రతి టీమ్‌‌.. పొట్టి కప్‌‌కోసం గట్టిగానే పోరాటం చేయనున్నాయి..! ఈ నేపథ్యంలో.. ఏ టీమ్‌‌లో ఎవరు ‘ఎక్స్‌‌ఫ్యాక్టర్‌‌’ పాత్ర పోషించనున్నారు..! వాళ్ల గురించి చూద్దాం..!!

వెలుగు క్రీడావిభాగం

టీ20 ఫార్మాట్‌‌లో దూకుడుగా ఆడే రెండో ఓపెనర్‌‌కోసం చూస్తున్న టీమిండియాకు షెఫాలీ వర్మ రూపంలో టాప్‌‌క్లాస్‌‌బ్యాట్స్‌‌వుమెన్‌‌లభించింది. టీ20ల్లో అరంగేట్రం చేసినప్పుడు షెఫాలీ వయసు 15 ఏళ్లు. దీంతో అతిచిన్న వయసులో ఇండియాకు ఆడిన తొలి బ్యాట్స్‌‌వుమెన్‌‌గా రికార్డులకెక్కింది. అలాగే ఇంటర్నేషనల్‌‌క్రికెట్‌‌లో అతి తక్కువ వయసులో హాఫ్‌‌సెంచరీ చేసిన రికార్డును కూడా సొంతం చేసుకుంది. తద్వారా 30 ఏళ్ల కిందట సచిన్‌‌నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. గతేడాది సౌతాఫ్రికాపై డెబ్యూ చేసిన ఈ హర్యానా అమ్మాయి ఇప్పటివరకు 14 మ్యాచ్‌‌ల్లో 324 రన్స్‌‌చేసింది. తన సహజసిద్ధమైన అటాకింగ్‌‌ప్లేతో టీ20 వరల్డ్‌‌కప్‌‌లో కీలక ప్లేయర్‌‌గా మారిపోయింది. ప్రత్యర్థి ఎవరైనా.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ రన్‌‌రేట్‌‌పెంచడంలో దిట్ట. ఇటీవల వెస్టిండీస్‌‌తో జరిగిన ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో 158 రన్స్‌‌చేసిన షెఫాలీ.. ప్లేయర్‌‌ఆఫ్‌‌ద టోర్నీగా నిలవడమే ఇందుకు నిదర్శనం. ఆలోచనల్లో క్లారిటీ, షాట్‌‌సెలెక్షన్‌‌లో సుపీరియారిటీ, ఆడే విధానం.. ఇలా ప్రతి అంశంలోనూ షెఫాలీ సూపర్బ్‌‌. బాయ్స్‌‌రూపంలో ఉండే వేషధారణతో ఇండియా మహిళల క్రికెట్‌‌లో క్రేజ్‌‌ను సంపాదించుకున్న షెఫాలీ.. చిన్నప్పట్నించి అబ్బాయిల అకాడమీలో శిక్షణ తీసుకుంది. ఎందుకంటే హర్యానాలోని అకాడమీల్లో గర్ల్స్‌‌ను చేర్చుకోరు.

కంగారుపెడుతుంది..

అలిసా హీలీ పేరు లేకుండా ఆసీస్‌‌మహిళల క్రికెట్‌‌ను ఊహించడం కష్టం. లాస్ట్‌‌ఎడిషన్‌‌వరల్డ్‌‌కప్‌‌లో ప్లేయర్‌‌ఆఫ్‌‌ద టోర్నీ. ఇక 2019లో ఐసీసీ బెస్ట్‌‌టీ20 ప్లేయర్‌‌గా అవార్డు సొంతం. వరుసగా రెండోసారి ఈ పురస్కారం తీసుకోవడం మరింత విశేషం. గత అక్టోబర్‌‌లో లంకపై 148 రన్స్‌‌చేసిన హీలీ.. టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్‌‌గా రికార్డును సాధించింది. టార్గెట్‌‌నిర్దేశించడంలోనైనా, ఛేజ్‌‌చేయడంలోనైనా హీలీ గ్రేట్‌‌ప్లేయర్ల సరసన నిలుస్తుంది. అయితే రీసెంట్‌‌గా ఇంగ్లండ్‌‌, ఇండియాతో జరిగిన ట్రై సిరీస్‌‌లో హీలీ విఫలంకావడం కాస్త నిరాశపర్చే అంశం అయినా.. వరల్డ్‌‌కప్‌‌లో ఫామ్‌‌లోకి వస్తుందని విశ్లేషకుల అంచనా. డిఫెండింగ్‌‌చాంపియన్‌‌హోదాలో దిగుతున్న ఆసీస్‌‌లో హీలీతో పాటు బెత్‌‌మూని, మెగ్‌‌లానింగ్‌‌కూడా కీలక ప్లేయర్లు. డబ్ల్యూబీబీఎల్‌‌లో టాప్‌‌–5 రన్‌‌గెట్టర్స్‌‌లో వీళ్లు ఉన్నారు. ఓవరాల్‌‌గా వరల్డ్‌‌కప్‌‌లో హీలీ బిగ్‌‌ఫ్యాక్టర్‌‌అనడంలో సందేహం లేదు.

బ్యాటింగ్‌‌డివైన్‌‌

72, 54*, 61, 77, 105.. గత ఐదు టీ20ల్లో న్యూజిలాండ్‌‌బ్యాట్స్‌‌వుమెన్‌‌సోఫీ డివైన్‌‌చేసిన స్కోర్లు ఇవి. టీ20 వరల్డ్‌‌కప్‌‌లో సోఫీ విశ్వరూపం ఎలా ఉండబోతుందో చెప్పడానికి ఇవి సరిపోతాయి. ఇక టీ20ల్లో వరుసగా ఐదు 50+ స్కోర్లు చేసిన ఫస్ట్‌‌ప్లేయర్‌‌గా సోఫీ రికార్డులకెక్కింది. కివీస్‌‌కొత్త కెప్టెన్‌‌గా ఆమె పెర్ఫామెన్స్‌‌ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోఫీ పవర్ హిట్టింగ్‌‌సామర్థ్యం, కీలక సమయంలో వికెట్లు తీసే సత్తా.. అపోజిషన్‌‌కు వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

ఆటలో పట్టు..

శ్రీలంక మహిళల టీమ్‌‌కెప్టెన్‌‌చామిరి ఆతపట్టుకు ఆటలో పట్టు చాలా ఎక్కువ. ఇటీవల ఆసీస్‌‌టూర్‌‌లో రెండు సెంచరీలు కొట్టింది. వన్డేల్లోనూ ఈ ఘనత సాధించింది. కాకపోతే మిగతా వారి నుంచి చామిరికి సహకారం చాలా తక్కువ. అందుకే లంక జట్టుకు అపజయాలు ఎక్కువ. గత తొమ్మిది మ్యాచ్‌‌ల్లో 30.11 యావరేజ్‌‌తో చామిరి 271 రన్స్‌‌చేసింది. ఇదే సమయంలో లంక తరఫున హయ్యెస్ట్‌‌వికెట్లు కూడా తీసింది. కేఎస్‌‌ఎల్‌‌లో లాబోర్గ్‌‌లైటనింగ్‌‌లో మంచి పెర్ఫామెన్స్‌‌చేయడంతో పాటు మహిళల బీబీఎల్‌‌లోనూ మెల్‌‌బోర్న్‌‌రెనగేడ్స్‌‌కు రీప్లేస్‌‌మెంట్‌‌ప్లేయర్‌‌గా అద్భుతమైన సేవలందించింది. వరల్డ్‌‌కప్‌‌లో లంక అదృష్టం మారాలంటే.. చామిరి ఆల్‌‌రౌండ్‌‌స్కిల్స్‌‌తో అదరగొట్టాల్సిందే.

హేలే మాథ్యూస్‌‌

ఈ పేరు చెప్పగానే 2016 టీ20 వరల్డ్‌‌కప్‌‌ఫైనల్‌‌గుర్తొస్తుంది. బలమైన ఆసీస్‌‌పేస్‌‌అటాక్‌‌ను భీకరంగా ఉతికి ఆరేస్తూ 66 రన్స్‌‌తో విండీస్‌‌ను విజేతగా నిలిపింది. అప్పట్లో 18 ఏళ్లే అయినా ఓపెనర్‌‌గా ఆమె బ్యాటింగ్‌‌మాత్రం అసాధారణం. తర్వాతి రోజుల్లో నిలకడలేమీతో టాప్‌‌ఆర్డర్‌‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ప్రస్తుతం కరీబియన్‌‌టీమ్‌‌లో బలమైన ప్లేయర్‌‌గా ఎదిగింది. లాస్ట్‌‌ఇయర్‌‌లో ఐర్లాండ్‌‌పై అజేయ సెంచరీ కొట్టింది. మంచి ఆఫ్‌‌స్పిన్నర్‌‌గా టీమ్‌‌కు అదనపు బలంగా మారింది. కెరీర్‌‌ఎకానమీ కూడా ఆరు కంటే తక్కువగా ఉండటం విశేషం. బ్యాటింగ్‌‌లో విఫలమైనా.. ఇటీవల విండీస్‌‌పై బౌలింగ్‌‌తో ఆకట్టుకుంది. గతేడాది బ్యాన్‌‌ఎదుర్కొన్నా.. ఇప్పుడు విండీస్‌‌టీమ్‌‌ను మరోసారి విజేతగా నిలపాలంటే హేలే రాణించాల్సిందే.

చోలే ట్రైయాన్‌‌

సిక్సర్లు కొట్టడంలో దిట్ట. ఆల్‌‌రౌండర్‌‌గా ట్రైయాన్‌‌సౌతాఫ్రికా తరఫున అత్యంత విలువైన ప్లేయర్‌‌గా మారింది. న్యూజిలాండ్‌‌తో జరిగిన ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో ఓ మ్యాచ్‌‌లో 16 బంతుల్లోనే 34 రన్స్‌‌చేసి టీమ్‌‌ను గెలిపించింది. ఇక లంకతో జరిగిన వామప్‌‌లో 9 బంతుల్లోనే 23 రన్స్‌‌చేసింది. ట్రైయాన్‌‌ఆడిన 61 మ్యాచ్‌‌ల్లో ఎకానమీ 7.11. లోయర్‌‌ఆర్డర్‌‌లో భారీ హిట్టింగ్‌‌తో టీమ్‌‌కు ఎక్స్‌‌ట్రా రన్స్‌‌రాబట్టడంలో దిట్ట.

Latest Updates