దెబ్బతీసిన ఫైనల్ : ICC ర్యాంకింగ్స్ లో అమ్మాయిలకు నిరాశే..!

ICC ఉమెన్స్ టీ20 ర్యాంకింగ్స్ లేటెస్ట్ గా విడుదలయ్యాయి. ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు వరకు టాప్ ప్లేస్ లో ఉన్న భారత మహిళా ప్లేయర్ షెఫాలీ వర్మకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో ఎక్కువ రన్స్ చేయకపోవడంతో ఆమె ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని కాపాడుకోలేక పోయింది. సోమవారం విడుదలైన లేటెస్ట్ ర్యాంకింగ్స్‌ లో షెఫాలీ..  రెండు ర్యాంకులు దిగజారి మూడో ప్లేస్‌ కు పడిపోయింది. టీ20 వరల్డ్‌ కప్‌ గ్రూప్‌ దశలో అద్భుత ప్రదర్శన చేసిన షెఫాలీ.. గత బుధవారమే  నంబర్‌‌ వన్‌ ర్యాంక్ సాధించింది.

కానీ, ఫైనల్లో రెండు పరుగులకే ఔటవడం షెఫాలీ ర్యాంక్‌ ను దెబ్బతీసింది. 744 రేటింగ్‌ పాయింట్లతో ఆమె ఒకటి నుంచి మూడో స్థానానికి పడిపోయింది. అదే సమయంలో ఫైనల్లో టాప్‌ స్కోరర్‌ ‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఓపెనర్‌‌ బెత్‌ మూనీ ..762 పాయింట్లతో మూడు నుంచి ఒకటో ర్యాంక్‌ కు దూసుకొచ్చింది. మొత్తం ఆరు ఇన్నింగ్స్‌ల్లో 259 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్  ద టోర్నమెంట్‌ గా మూనీ తన కెరీర్‌ ‌లో ఫస్ట్ టైం నంబర్‌‌ వన్‌ ర్యాంక్‌ అందుకుంది.

స్మృతి మంధా, జెమీమా రోడ్రిగ్స్‌ టాప్‌–10లో చోటు దక్కించుకున్నారు. ప్రపంచకప్‌ లో నిరాశ పరిచిన మంధాన.. ఆరు నుంచి ఏడో ప్లేస్‌ కు పడిపోగా, జెమీమా రోడ్రిగ్స్‌ తొమ్మిదో స్థానంలోనే కొనసాగుతుంది. భారత ఆల్‌ రౌండర్‌‌ దీప్తి శర్మ బ్యాటింగ్‌ విభాగంలో  పది స్థానాలు ఎగబాకి 43వ ర్యాంక్‌ అందుకోగా, ఆల్‌ రౌండర్ల విభాగంలో తొలిసారి టాప్‌–5లోకి వచ్చింది. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి, రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌ వరుసగా 6,7,8 స్థానాల్లో నిలిచారు. ఇంగ్లండ్‌ బౌలర్‌‌ సోఫీ ఎకిల్‌ స్టోన్‌ టాప్‌ ప్లేస్‌ నిలబెట్టుకుంది.

see also: 60 ఏళ్లకు పెళ్లి చేసుకున్న కాంగ్రెస్ నేత

మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడు

కళ్యాణి ప్రియదర్శినికి శక్తి ఎంటో చూపించాడు

Latest Updates