టీ20 వరల్డ్ కప్‌లో భారత్ బోణీ

icc-womens-t20world-cup-india-won-by-17-rusn-on-australia

విమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన తొలి టీ20 లో భారత్ బోణి కొట్టింది. 17 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. భారత బౌలర్లు, పూనమ్ యాదవ్, శిఖా పాండే దాటికి ఆసిస్ 19.5 ఓవర్లలో  115 పరుగులకే చేతులెత్తేసింది. 133 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసిస్ మొదటి నుంచి ఆకట్టుకోలేకపోయింది. ఓపెనర్ అలిస్సా హీలీ 51 పరుగులు,  ఆష్లీ గార్డనర్ 34 పరుగులు మినహా ఎవరూ రాణించలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 118 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ కు 4, శిఖా పాండేకు 3, రాజేశ్వరీ గైక్వాడ్ కు ఒక వికెట్ పడ్డాయి.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 20 ఓవర్లకు  4 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఒపెనర్ షెఫాలీ వర్మ 29,  జెమిమా రోడ్రిగ్స్ 26, దీప్తి శర్మ 49(నాటౌట్) చెలరేగడంతో భారత్ 132 పరుగులు చేయగల్లింది. ఆసిస్ బౌలర్లకు జోనస్సెన్ కు రెండు, ఎలిసీ పెర్రీ, డెలిస్సాకు చెరో వికెట్ పడ్డాయి.

Latest Updates