ఆర్కిటిక్​ కరుగుతోంది!

ఆర్కిటిక్​ మహాసంద్రంలోని ఐస్​ అనుకున్నదాని కన్నా వేగంగా కరిగిపోతోందట. జులైలో వేడి పెరగడంతో ఉత్తర ధ్రువం వద్ద ఐసంతా కరిగిపోతోందని కొలరాడోలోని నేషనల్​ స్నో అండ్​ ఐస్​ డేటా సెంటర్​ ప్రకటించింది. 2012 జులై రికార్డుకు చేరువవుతోందని తెలిపింది. ఆర్కిటిక్​ సర్కిల్​లోని అలస్కా, కెనడా, గ్రీన్​ల్యాండ్​లలో టెంపరేచర్లు పెరగడంతో మూడు దశాబ్దాల సగటు కరుగుదల కన్నా స్పీడ్​గా ఐస్​ కరిగిపోతోందని చెప్పింది. దాని వల్ల 20 వేల చదరపు కిలోమీటర్ల మేర మంచు మాయమవుతోందని పేర్కొంది.

ఉత్తరార్ధగోళంలో వసంతకాలం నాటికి మంచు కరగడం మొదలవుతుందని, కరిగాక, మళ్లీ సెప్టెంబర్​ నాటికి తిరిగి మునుపటి స్థితిలోకి వస్తుందని చెప్పింది. అయితే, ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించకపోవచ్చని బ్రిటన్​ వాతావరణ శాఖ తెలిపింది. ఆర్కిటిక్​ సర్కిల్​లో ప్రస్తుతం ఎన్నడూ లేనంతగా కార్చిచ్చు రాజుకుందని, కొన్ని వారాల్లోనే వందలాది కార్చిచ్చు ఘటనలు వెలుగులోకి వచ్చాయని, అది కూడా ఆర్కిటిక్​ ఐస్​పై ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని యూరోపియన్​ యూనియన్​ కోపర్నికస్​ క్లైమేట్​ చేంజ్​ సర్వీస్​ వెల్లడించింది.

 

Latest Updates