పోలీస్ అధికారి భార్యతో తాపీగా ఐస్ క్రీమ్ తింటుండగా..ఓ దొంగ

ఓ పోలీస్ అధికారి భార్యతో తాపీగా ఐస్ క్రీమ్ తింటుండగా ఓ దొంగ తుపాకీతో ఆ దంపతుల్ని బెదిరించేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో స్పాంటేనియష్ గా సదరు పోలీస్ అధికారి స్పందించిన తీరుపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

స్పెయిన్ లోని సాయాగో అనే ప్రాంతంలో  పోలీస్ అధికారి తన భార్యతో కలిసి ఐస్ క్రీమ్ పార్లర్ లో ఐస్ క్రీమ్ తింటున్నాడు. తినే సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దొంగలు ..పోలీస్ అధికారి, అతని భార్యను తుపాకీతో బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీస్ అధికారి కను రెప్పపాటు సమయంలో ఐస్ క్రీమ్ కోన్ చేతిలో ఉన్నా..మరో చేత్తో తన ప్యాంట్ జేబులో ఉన్న తుపాకీని బయటకు తీసి దొంగపై కాల్పులకు తెగబడ్డాడు. పోలీస్ అధికారి తీరుతో కంగుతిన్న దొంగలు అక్కడి నుంచి పరరారయ్యారు. ఐస్ క్రీమ్ పార్లర్ సీసీటీవీ పుటేజీలో రికార్డైన ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

 

Latest Updates