ఆరోగ్య బాధ్యత అందరిదీ : ఉపరాష్ట్రపతి వెంకయ్య

హైదరాబాద్‌ లో ఉత్తమ ట్రీట్ మెంట్ అందించే హస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్‌ లోని తాజ్‌ కృష్ణలో మూడు రోజులపాటు జరిగే అంతర్జాతీయ ఆరోగ్య సదస్సును ఆదివారం ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన .. ఆరోగ్య బాధ్యత ఒక్క ప్రభుత్వానిదే కాదని, ప్రైవేటు సంస్థలు కూడా  ముందుకురావాలన్నారు.

అంటువ్యాధులు విజృంభించకుండా ముందస్తు చర్యలు అవసరమని చెప్పారు. దీనికోసం జాగ్రత్తలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. వైద్యులు చికిత్స అందించడమే కాకుండా ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెంపొందేలా అవేర్ నెస్ క్యాంపులు నిర్వహించాలన్నారు. విదేశాల్లో ఉన్నా మనదేశ ఆహారపు అలవాట్లు మరిచిపోవద్దన్నారు. విదేశీ సంస్కృతి సంప్రదాయాల్లో పడి స్వదేశీ సంప్రదాయాలను విస్మరించవద్దని వెంకయ్యనాయుడు సూచించారు.

Latest Updates