ICICI బోర్డ్ లో చీలిక : చందాకొచ్చర్ ను తొలగించాలని డిమాండ్

chandaఐసీఐసీఐ CEO  చందా కొచ్చర్ భవితవ్యంపై నిర్ణయంలో రెండుగా చీలింది బ్యాంకు బోర్డు.  చందా కొచ్చర్ రాజీనామా చేయాలని కొంత మంది.. అవసరం లేదని మరికొంత మంది సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ విషయంపై ఐసీఐసీఐ బోర్డు సభ్యులు ఈ వారంలోనే మళ్లీ సమావేశం కాబోతున్నారు. సీఈవోగా కొచర్‌ పదవీ కాలం 2019 మార్చి 31 వరకు ఉంది. ప్రస్తుతం బోర్డులో 12 మంది ఉన్నారు. చైర్మన్‌ ఎంకే శర్మ ఆధ్వర్యంలో ఈ బోర్డు నడుస్తోంది.

క్విడ్‌ ప్రో కో కింద వీడియోకాన్‌ గ్రూప్‌కు చందా కొచర్‌ అప్పు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఇప్పటికే ఆమె వివరణ కూడా ఇచ్చారు. దీంతో కొచ్చర్ పై పూర్తి విశ్వాసం ఇప్పటికే వ్యక్తం చేసింది బోర్డు. ఆ తర్వాత పరిణామాలు మాత్రం ఆమెకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆమె భర్త, మరిది పాత్ర ఉన్నట్లు సీబీఐ విచారణలో తేలుతుండటంతో.. ఆమెపై చర్యలు తీసుకునే దిశగా బోర్డులోని కొందరు డైరెక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. భర్త దీపక్‌, వీడియోకాన్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌ ధూత్‌ ను ఇప్పటికే విచారించింది సీబీఐ. ఈ పరిస్థితుల్లో ఆమె కొనసాగించాలా.. తొలిగించాలా అనే విషయంపై త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

Posted in Uncategorized

Latest Updates