ICICI బ్యాంక్ సీఈవో పదవి నుంచి తప్పుకొన్న చందాకొచ్చర్

ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో పదవి నుంచి చందాకొచ్చర్ తప్పుకొంది. సందీప్ భక్షి ఐసీఐసీఐ నూతన సీఈవో, ఎండీగా నియమితులయ్యారు. బ్యాంక్ నుంచి ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవాలన్న చందాకొచ్చర్ విజ్ణప్తిని ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ అంగీకరించింది. అక్టోబర్-3, 2023 వరకూ ఐదేళ్లు ఐసీఐసీఐ సీఈవో పదవిలో సందీప్ భక్షి కొనసాగనున్నారు.

చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ కి చెందిన నూపవర్ రినీవబల్స్ కంపెనీ ఓ వీడియోకాన్ కంపెనీ నుంచి ఇన్వెస్టిమెంట్ పొందినట్లు, వీడియో కాన్ కంపెనీకి చందాకొచ్చర్  లోన్లు ఇచ్చి…వాటిని క్విడ్ ప్రోకో పద్దతిలో మరల ఆమె భర్తకి చెందిన కంపెనీలోకి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుని ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. చందాకొచ్చర్ సీఈవో పదవి నుంచి తప్పుకోవాలని బ్యాంక్ అధికారులు ఒత్తిడి తెచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాము చందాకొచ్చర్ ను తప్పుకోమని కోరలేదని ఐసీఐసీఐ బ్యాంక్ ఇటీవల ప్రకటించింది.

1984 లో మేనేజ్ మెంట్ ట్రైనీగా ఐసీఐసీఐ బ్యాంక్ లో చందాకొచ్చర్ జాయిన్ అయ్యారు. ప్రపంచంలోని శక్తివంతమైన మహిళలలో చందాకొచ్చర్ కూడా ఒకరు.

Posted in Uncategorized

Latest Updates