ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీరేట్లు తగ్గాయ్!

  • 10 బేసిస్ పాయింట్లు తగ్గింపు

దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ తన లెండింగ్ రేట్లను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ సిస్టమ్‌‌లోని అన్ని టెన్యూర్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు పేర్కొంది. ఆర్‌‌‌‌బీఐ రెపో రేటుకు కోత పెట్టడంతో, ఈ వడ్డీ రేట్లను తగ్గించింది. సమీక్షించిన ఈ వడ్డీ రేట్లు ఈ నెల మొదటి నుంచే అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ వన్ ఇయర్ ఎంసీఎల్‌‌ఆర్ 8.55 శాతానికి తగ్గింది. ఓవర్‌‌‌‌నైట్ ఎంసీఎల్‌‌ఆర్ 8.30 శాతంగా ఉంది. వన్‌‌ ఇయర్ ఎంసీఎల్‌‌ఆర్ అనేది రిటైల్ లోన్స్ సెగ్మెంట్‌‌లో ఎంతో కీలకమైనది. అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌‌డీఎఫ్‌‌సీ వన్ ఇయర్ ఎంసీఎల్‌‌ఆర్ రేటు ప్రస్తుతం 8.60 శాతంగా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ జూలై తొలి వారంలో కూడా వడ్డీ రేట్లను సమీక్షించింది. ఆ సమయంలో 0.05 శాతం వడ్డీ రేట్లను తగ్గించింది.

Latest Updates