నన్ను నమ్మండి..ఆ రూ.3,250కోట్ల కుంభకోణంతో నాకు సంబంధం లేదు : ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ

ఒకప్పుడు బ్యాంకింగ్ రంగంలో మకుటం లేని మహరాణిలా ఓ వెలుగు వెలిగిన చందాకొచ్చర్ వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్, సీఈఓగా ఉన్న చందా కొచ్చర్ 2009 నుంచి 2018 వరకు 2 నుంచి 7లోన్ల వరకు వీడియోకాన్ గ్రూప్ కు అప్రూవల్ ఇచ్చినట్లు, అందుకు గాను పెద్దమొత్తంలో కమీషన్ తీసుకున్నట్లు ఈడీ విచారణలో తేలింది.

ఈ కుంభకోణానికి ముందుకు ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ గా ఉన్న చందా కొచ్చర్..,బ్యాంక్ తరుపున క్రెడిట్ బ్యాంక్ అప్రువల్ కమిటీలో ఉన్న 31మందిలో ఒక సభ్యురాలిగా ఉన్నారు.

ఆ హోదాను అడ్డం పెట్టుకొని చందా కొచ్చర్ భారీ స్థాయిలో వీడియో కాన్ తో క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందాకొచర్ భర్త దీపక్ కొచర్‌‌‌‌కు చెందిన కంపెనీ న్యూపవర్ రెన్యూవబుల్స్‌‌కు, వేణుగోపాల్ ధూత్‌‌కు చెందిన వీడియోకాన్ ఇండస్ట్రీస్‌‌కు మధ్య జరిగిన డీలింగ్స్ విషయంలో విచారణ చేపట్టాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్‌‌ఎఫ్‌‌ఐఓ)ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఆదేశించింది. 2012లో ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.3,250 కోట్ల రుణం జారీ కావడంతో, దానికి ప్రతిఫలంగా దీపక్ సంస్థకు వీడియోకాన్ ఇండస్ట్రీస్‌‌ కోట్ల రూపాయలను ఇచ్చిందని ఆరోపణలున్నాయి. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ కూడా విచారణ చేపట్టింది. ఇప్పటికే నిందితులు పలుసార్లు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.

తాజాగా ఈ కేసు లో రూ.78.15 కోట్ల రూపాయల విలువైన  చందా కొచ్చార్, ఆమె భర్త దీపక్ కొచర్ ఆస్తులను జతచేయాలని కోరుతూ ఈడీ చేసిన విజ్ఞప్తిని కొట్టివేస్తూ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా చందా కొచర్ మాట్లాడుతూ ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓగా పనిచేసే సమయంలో వీడియోకాన్ కు ఇచ్చిన లోన్ ప్రాసెస్ లో తన ప్రమేయం లేదని, తాను వీడియోకాన్ కు ఎలాంటి రుణాల్ని మంజూరు చేయలేదని తెలిపిన చందా కొచర్..అత్యున్నత హోదాలో ఉన్న తనకి లోన్స్ కి అప్రూవల్ ఇచ్చే అధికారం తనకు లేదని సమర్ధించుకున్నారు.

Latest Updates