లెర్న్​ స్కిల్స్..​గెట్​ జాబ్స్​

icici-foundation-skill-devlopment-institute

ఆర్థిక స్వావలంబన కొరవడి చదువులకు దూరమయ్యే యువతీయువకులను ట్రైన్​ చేయడానికి ఐసీఐసీఐ ఫౌండేషన్​ 2013లో ఐసీఐసీఐ అకాడమీ ఫర్​ స్కిల్స్​ ఇన్‌‌‌‌స్టిట్యూట్​ను నెలకొల్పింది. ఫైనాన్షియల్​ ఇన్​క్లూజన్​లో భాగంగా నెలకొల్పిన ఈ అకాడమీ దేశవ్యాప్తంగా 25 సెంటర్ల ద్వారా ఇప్పటివరకు దాదాపు లక్షా 30 వేల మంది (52 వేల మంది మహిళలు) కి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించింది. సెల్లింగ్​ స్కిల్స్​, ఆఫీస్​ అడ్మినిస్ర్టేషన్​, ఎలక్ర్టికల్​ అండ్​ హోం అప్లయన్సెస్​ రిపేర్​, రిఫ్రిజరేషన్​ అండ్​ ఎయిర్​ కండిషనింగ్​ రిపేర్, సెంట్రల్​ ఎయిర్ కండిషనింగ్​, పంప్స్​ అండ్​ మోటార్​ రిపేర్​, పెయింట్​అప్లికేషన్​ టెక్నిక్స్​, ట్రాక్టర్​ మెకానిక్, టు అండ్​ త్రీ వీలర్​ సర్వీస్​ టెక్నీషియన్​, రీటెయిల్​ సేల్స్​, అసిస్టెంట్​ బ్యూటీ థెరపిస్ట్​, హోం హెల్త్​ ఎయిడ్​ వంటి 12 కోర్సుల్లో ట్రైనింగ్​ ఇస్తున్నారు. మరిన్ని వివరాలకు www.icicifoundation.org/icici-aca demy-for-skills/ వెబ్​లింక్ చూడొచ్చు.

అర్హతలివే..

పదోతరగతి నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఉండాలి. డిగ్రీ లోపు నేరుగా అకాడమీలో సంప్రదించి అడ్మిషన్​ పొందొచ్చు. సంస్థ నిర్వహించే అవగాహన కార్యక్రమాలు, ఎన్​జీవోలు, ప్రభుత్వం, టాప్​  కంపెనీల రెఫరెన్స్​ ద్వారా కూడా ప్రవేశం కల్పిస్తారు. రెండు పాస్‌‌‌‌పోర్ట్​ సైజ్​ఫోటోగ్రాఫ్స్​, ఐడీ, అడ్రస్​ ప్రూఫ్, ఎడ్యుకేషన్​ సర్టిఫికెట్​ వంటి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్లాలి.

ఎక్స్​పర్ట్ టీచింగ్​

హైదరాబాద్‌‌‌‌లో అసెంబ్లీకి ఎదురుగా ఉన్న ఐసీఐసీఐ అకాడమీ.. ఆఫీస్​ అడ్మినిస్ర్టేషన్​, సెల్లింగ్​ స్కిల్స్, రీటెయిల్ స్కిల్స్​ వంటి మూడు కోర్సుల్లో ఫ్రీ ట్రైనింగ్​ ఇస్తోంది. శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. యూనిఫామ్స్​, కోర్సు మెటీరియల్, స్టేషనరీ వంటివి అందిస్తారు. అధునాతన క్లాస్‌‌‌‌రూమ్స్, అడ్వాన్స్​డ్​ కంప్యూటర్​ ల్యాబ్స్​ లో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ టీచ్​ చేస్తారు. అకాడమీ సొంతంగా రూపొందించున్న కరిక్యులమ్​ బోధిస్తారు. కోర్సు ట్రైనింగ్‌‌‌‌కు అదనంగా కమ్యూనికేషన్​ అండ్​ ఫైనాన్స్​ స్కిల్స్​, ఎటిక్వెట్​ అండ్ గ్రూమింగ్​ స్కిల్స్​ కూడా నేర్పిస్తారు. కోర్సుకు సంబంధించిన సందేహాలతో పాటు కెరీర్స్, ఉద్యోగావకాశాలు వంటి వాటిపై ఫ్యాకల్టీ అవగాహన కల్పిస్తారు.

350 కంపెనీల్లో జాబ్స్​

ట్రైనింగ్ పూర్తిచేసుకున్నవారికి అకాడమీలోనే ఇంటర్వ్యూలు, ప్లేస్​మెంట్​ డ్రైవ్స్​ నిర్వహించి దాదాపు 350 పైగా కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తారు. రిలయన్స్​ ట్రెండ్స్​, ఫ్యూచర్​ ఫ్యాషన్​, టాటా క్రోమా, ల్యాండ్​మార్క్​,  లైఫ్​స్టైల్​, ట్యాలీ, వంటి సంస్థలు హైదరాబాద్​లో ట్రైన్​ అయిన స్టూడెంట్స్‌‌‌‌ను రిక్రూట్​ చేసుకుంటున్నాయి.

వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్

 

Latest Updates