విశాక షేరుకి ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ బై రికమండేషన్

టార్గెట్ ధర రూ.455కి పెంపు

బలంగా ఉన్న బ్యాలెన్సు షీట్

హైదరాబాద్‌, వెలుగు: సిమెంట్‌ రూఫ్ లను తయారు చేసే విశాక ఇండస్ట్రీస్‌ షేరును కొనాలని బ్రోకరేజి సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ రికమండ్‌ చేసింది. ఈ షేరుకు బై రేటింగ్‌ ఇస్తూ, టార్గెట్‌ ధరను రూ. 455 కు పెంచింది. కాగా, బుధవారం సెషన్ లో విశాక ఇండస్ట్రీస్‌ షేరు 1.85 శాతం లాభపడి రూ.271.10 వద్ద క్లోజయ్యింది. ఆస్బెస్టస్‌ సిమెం ట్‌ షీట్సు (ఏసీఎస్‌) సెగ్మెంట్‌లో డిమాం డ్‌ పెరగడంతో ప్రస్తుత కరోనా సంక్షోభంలోనూ విశాక ఇండస్ట్రీస్‌ మంచి పనితీరును కనబరుస్తోందని ఈ బ్రోకరేజి పేర్కొంది. రూరల్‌ ఎకానమీ మెరుగుపడుతుం డడం, రికార్డ్‌ స్థాయిలో రబీ దిగుబడి, ఈ ఏడాది వర్షాలు కూడా సరియైన టైమ్ లో పడుతుం డడం వంటి కారణాల వలన ఏసీఎస్‌ సెగ్మెంట్‌కు డిమాండ్ పెరుగుతోం దని అంచనా వేసింది.

గత పదేళ్లతో పోల్చుకుం టే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విశాక ఇండస్ట్రీస్‌ లాభాలు ఎక్కువ ఉంటాయని అంచనా వేసింది. కంపెనీ ప్రాఫిట్‌బిలిటీ, ఫ్రీ క్యాష్‌ ఫ్లోస్‌ఎఫ్ సీఎఫ్ ) మెరుగుపడడంతో కంపెనీ అప్పులు 340 బేసిస్ పాయిం ట్ల వరకు తగ్గుతాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఎర్నింగ్స్‌ కూడా మెరుగుపడతాయని పేర్కొంది. ఏసీఎస్‌ బిజినెస్‌లో క్యాష్ ఫ్లోస్‌ పెరగడంతో కంపెనీకి చెందిన వీనెక్స్ట్‌ డివిజన్ లో కెపాసిటీని పెంచడానికి విశాక ఇండస్ట్రీస్‌కు వీలుంటుం దని పేర్కొంది. వచ్చే కొన్నేళ్లలో కంపెనీ ఆదాయాలు పెరగడానికి ఇది సాయపడుతుందని తెలిపింది. ప్రస్తుత స్థాయిల వద్ద విశాక షేరు చాలా ఆకర్షణీయంగా ఉందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ పేర్కొంది.

ఏసీఎస్‌ సెగ్మెంట్‌లో ఆదాయాలు పెరగడంతో ఈ కంపెనీ రెవెన్యూ, ట్యాక్స్‌ తర్వాత లాభం(పాట్‌) అంచనాలను ఐసీఐసీఐ సెక్యూ రిటీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 5.1 శాతం, 4.5 శాతం పెంచింది. ఆర్థిక సంవత్సరం 22 కు గాను 94.5 శాతం, 45.5 శాతం పెం చింది. మొత్తంగా ఆర్థిక సంవత్సరం 20–22 మధ్య కాలంలో విశాక రెవెన్యూ అంచనా వేసిం ది. ప్రస్తుత కరోనా పరిస్థితులలో కూడా కంపెనీ ఆదాయాలు పెరుగుతుండడం, బ్యాలెన్స్‌ షీట్‌బలంగా ఉండడం వంటి అంశాలను ఐసీఐసీఐ సెక్యూ రిటీస్‌ పరిగణనలోకి తీసుకుంది.

మార్చి క్వార్టర్‌‌లో… విశాక లాభం రూ. 6.86 కోట్లు

ఈ ఏడాది మార్చి తో ముగిసి న క్వార్టర్ లో ‌ విశాక ఇండస్ట్రీస్ రూ. 6.86 కోట్ల నికర లాభం వచ్చిం ది. కంపెనీ సేల్స్‌ ​సీక్వెన్షియల్ గా 5.69 శాతం తగ్గి రూ. 227.71 కోట్లుగా ఉన్నాయి. ఇది డిసెంబర్‌‌ క్వార్టర్‌‌లో రూ. 2 41.44 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది మార్చి క్వార్టర్ లో జరిగి న రూ.299.75 కోట్ల సేల్స్‌ కంటే ఈ మార్చి క్వార్టర్‌‌లో అమ్మకా లు 24.03 శాతం తగ్గాయి. మార్చి 31,2020 నాటికి విశాక ఇండస్ట్రీస్ లో ప్రమోటర్ల వాటా రూ. 42.5 శాతంగా ఉంది. ఫారిన్‌ ఇన్ స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ) వాటా 1.5 శాతంగా, డొమెస్టిక్‌ ​ఇన్ స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల(డీఐఐ) వాటా1.3 శాతంగా ఉంది. మిగిలిన 56 శాతం వాటా పబ్లిక్‌, ఇతరుల చేతుల్లో ఉంది.

Latest Updates