కరోనా థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయి

V6 Velugu Posted on Aug 31, 2021

త్వరలోనే దేశంలో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తం చేసింది ఐసీఎంఆర్. ఇదే విషయాన్ని ICMR కు చెందిన అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ సమిరన్ పాండా తెలిపారు. థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు. సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా లేని రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని..ఈ ట్రెండ్ థర్డ్  వేవ్ సంకేతాలను చూపుతోందని హెచ్చరించారు.

సెకండ్ వేవ్ సమయంలో అనేక రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయని.. వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయని..దీంతో సెకండ్ వేవ్ అంత తీవ్రతను చూపలేదని చెప్పారు. ఇప్పుడు అందరూ మూడో వేవ్ కు సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.

Tagged ICMR, Dr Samiran Panda, COVID cases some states, signs third wave 

Latest Videos

Subscribe Now

More News