డెల్టాను ఒమిక్రాన్ రీప్లేస్ చేస్తే.. వైరస్ ముప్పు తగ్గే చాన్స్

డెల్టాను ఒమిక్రాన్ రీప్లేస్ చేస్తే.. వైరస్ ముప్పు తగ్గే చాన్స్
  • కరోనా తీవ్రత మార్చిలో తగ్గుతది
  • డెల్టాను ఒమిక్రాన్ రీప్లేస్ చేస్తే.. వైరస్ ముప్పు తగ్గే చాన్స్
  • ఐసీఎంఆర్ ఎక్స్ పర్ట్ సమీరన్
  • కొత్త కేసులు 2.82 లక్షలు
  • తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: మరో రెండు నెలల్లో కరోనా ప్యాండెమిక్ నుంచి ఎండెమిక్ దశకు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఎపిడెమియాలజికల్ డిపార్ట్ మెంట్ చీఫ్​ సమీరన్ పండా వెల్లడించారు. ప్రస్తుతం తీవ్రంగా ఉన్న డెల్టా వేరియంట్ స్థానంలో ఒమిక్రాన్ వ్యాపిస్తే.. వైరస్ ముప్పు తగ్గే చాన్స్ ఉందని ఆయన తెలిపారు. కరోనా ప్రస్తుతం ప్యాండెమిక్(అనేక దేశాలకు వ్యాపించే వ్యాధి) దశలో ఉందని, కానీ ఒమిక్రాన్ వ్యాప్తి పెరిగితే మార్చి 11వ తేదీకల్లా కరోనా ఎండెమిక్(దేశంలో అక్కడక్కడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యే వ్యాధి) దశకు మారొచ్చన్నారు. డెల్టా ప్లేస్​ను ఒమిక్రాన్ ఆక్రమిస్తే.. కొత్త వేరియంట్ పుట్టే చాన్స్ తక్కువగా ఉంటుందన్నారు. డిసెంబర్ 11న మొదలైన ఒమిక్రాన్ వేవ్ మూడు నెలల పాటు కొనసాగుతుందని అంచనా వేసినట్లు పండా చెప్పారు. అలాగే ఢిల్లీ, ముంబైలో థర్డ్ వేవ్ పీక్ స్టేజీకి చేరిందా? లేదా? అనేది చెప్పడానికి మరో రెండు వారాలు వెయిట్ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఈ రెండు సిటీల్లో డెల్టా కేసులు 80%, ఒమిక్రాన్ కేసులు 20% వస్తున్నాయని ఆయన తెలిపారు. ఇక మోల్నుపిరవిర్ ను కరోనా పేషెంట్ల ట్రీట్ మెంట్​కు వాడటంపై ఐసీఎంఆర్, డీసీజీఐ గైడ్ లైన్స్ వేర్వేరుగా ఉండటంపైనా ఆయన స్పందించారు. టీకాలు వేసుకోని పేషెంట్లకు మాత్రమే ఈ మందును ఇవ్వాలని, కానీ ప్రెగ్నెంట్లు, పాలిచ్చే తల్లులు, పిల్లలకు వాడేందుకు ఎలాంటి గైడ్​లైన్స్ లేనందున దీనిని కరోనా మందుల ప్రొటోకాల్​లో చేర్చలేదన్నారు.

దేశంలో ఒక్కరోజే 2.82 లక్షల మందికి కరోనా
దేశంలో గడిచిన 24 గంటల్లో 2,82,970 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా మొత్తం కేసుల సంఖ్య 3,79,01,241కి పెరిగిందని, ఇందులో 8,961 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. యాక్టివ్ కేసులు 18,31,000కి పెరిగాయి. గత 232 రోజుల్లో యాక్టివ్​కేసులు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. కరోనాతో కొత్తగా 441 మంది మృతి చెందారని, దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,87,202కి చేరినట్లు హెల్త్​మినిస్ట్రీ పేర్కొంది. మంగళవారం నుంచి ఒమిక్రాన్ కేసుల్లో 0.79 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. మొత్తం ఇన్​ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 4.83 శాతం ఉండగా, రికవరీ రేటు 93.88 శాతానికి తగ్గిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు15.13 శాతంగా నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,55,83,039కి పెరిగింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 158.88 కోట్లకు పైగా డోసులు కంప్లీట్​చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 441 కొత్త మరణాల్లో కేరళ122, మహారాష్ట్ర 53, పశ్చిమ బెంగాల్ నుంచి 34 ఉన్నాయి.